ఆటాపోటీ

సెంచరీ వీరులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెస్టుల్లో ఇంగ్లాండ్‌పై ఎక్కువ సెంచరీలు చేసిన రికార్డును రాహుల్ ద్రవిడ్‌తో కలిసి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్ పంచుకుంటున్నాడు. వీరిద్దరూ చెరి ఏడు సెంచరీలు సాధించారు. ఇంగ్లాండ్ తరఫున భారత్‌పై కెవిన్ పీటర్సన్ అత్యధికంగా ఆరు శతకాలు నమోదు చేశాడు. ఇయాన్ బోథమ్, గ్రాహం గూచ్ చెరి ఐదు సెంచరీలు చేసి ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. అర్ధ శతకాల విషయంలో రికార్డును సునీల్ గవాస్కర్‌తో కలిసి సచిన్ షేర్ చేసుకుంటున్నాడు. వీరిద్దరూ ఇంగ్లాండ్‌పై చెరి 20 అర్ధ శతకాలు చేశారు. ఇంగ్లాండ్ తరఫున గ్రాహం గూచ్ భారత్‌పై అత్యధికంగా 13 హాఫ్ సెంచరీలు చేశాడు.
రెండు దేశాల మధ్య జరిగిన టెస్టుల్లో ఎక్కువ పరుగులు చేసిన రికార్డు కూడా సచిన్ పేరు మీదే ఉంది. అతను మొత్తం 32 టెస్టుల్లో 2,535 పరుగులు చేశాడు. రెండో స్థానంలో సునీల్ గవాస్కర్ ఉన్నాడు. అతను 38 మ్యాచ్‌లు ఆడి 2,483 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో మూడు, నాలుగు స్థానాలు కూడా భారత్‌కే దక్కాయ. రాహుల్ ద్రవిడ్ 21 మ్యాచ్‌ల్లో 1,950 పరుగులు చేయగా, గుండప్ప విశ్వనాథ్ 30 టెస్టులు ఆడి 1,880 పరుగులు సాధించాడు. ఇం గ్లాండ్ తరఫున భారత్‌పై ప్రస్తుత కెప్టెన్ అలిస్టర్ కుక్ 20 మ్యాచ్‌ల్లో 1,735 పరుగులు చేసి, ఐదో స్థానాన్ని ఆక్రమించాడు. ఆరో స్థానంలో ఉన్న గ్రాహం గూచ్ 19 టెస్టుల్లో 1,725 పరుగులు చేశాడు.
భారీ, అత్యల్ప స్కోర్లు: భారత్‌పై ఇంగ్లాండ్‌కు ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు ఏడు వికెట్లకు 710 పరుగులు. 2011 ఆగస్టులో జరిగిన బర్మింహామ్ టెస్టులో ఇంగ్లాండ్ ఈ స్కోరు నమోదు చేసింది. ఈ జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంది. 2007 ఆగస్టులో ది ఓవల్ మైదానంలో జరిగిన టెస్టులో భారత్ 664 పరుగులు చేసింది. కాగా, మూడు నుంచి ఆరు స్థానాల్లో ఇంగ్లాండ్ ఉండడం గమనార్హం. ఇంగ్లాండ్‌తో జరిగి టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోర్లలో భారత్ నంబర్ స్థానాన్ని ఆక్రమించింది. అజిత్ వాడేకర్ నేతృత్వంలో ఇంగ్లాండ్ వెళ్లిన భారత్ 1974 జూన్‌లో ‘క్రికెట్ మక్కా’గా పిలిచే లార్డ్స్ మైదానంలో కేవలం 42 పరుగులకే ఆలౌటైంది. రెండు దేశాల ద్వైపాక్షిక టెస్టు ఇన్నింగ్స్‌లో భారత్ మొత్తం తొమ్మిది పర్యాయాలు వందకంటే తక్కువ పరుగులు చేసింది. ఒకసారి సరిగ్గా వంద పరుగులకు ఆలౌటైంది. మొత్తం మీద ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో వంద లేదా అంతకంటే ఎక్కువగా పరుగులు భారత్ ఖాతాలో పది ఉంటే, ఇంగ్లాండ్‌కు ఒక్కటి కూడా లేదు.
సున్నాల్లో బేడీ టాప్: ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టుల్లో ఎక్కువ పర్యాయాలు డకౌటైన ఆటగాడు బిషన్ సింగ్ బేడీ. అతను 11 పరాయాలు సున్నాకే అవుటయ్యాడు. పంకజ్ రాయ్, భగవత్ చంద్రశేఖర్ చెరి ఎనిమిది సార్లు పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. ఎర్రాపల్లి ప్రసన్న, వీరేందర్ సెవాగ్ చెరి ఏడుసార్లు ఈ విధంగా పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరారు.