క్రీడాభూమి

విజయవాడ చేరిన మహిళా క్రికెటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 6: భారత్, వెస్టిండీస్ మహిళా క్రికెట్ జట్ల సభ్యులు ఆదివారం విజయవాడ చేరుకున్నారు. కృష్ణా జిల్లా మూలపాడులో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఎసిఎ), కెడిసిఎ స్టేడియంలో ఈ నెల 10 నుండి 22 వరకు భారత్, వెస్టిండీస్ మహిళా క్రికెట్ జట్ల మధ్య మూడు వనే్డలు, మూడు టి-20 మ్యాచ్‌లు జరగనున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం మూలపాడులో జరగనున్న మొట్టమొదటి అంతర్జాతీయ టోర్నమెంట్ ఇదే. అంతేగాక ఎసిఎ, కెడిసిఎ స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్ జరగడంతో నగర ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దీనికితోడు నగరానికి చెందిన ఎస్ మేఘన భారత టి-20 జట్టులో స్థానం పొంది హోమ్ గ్రౌండ్‌లో ఆడనుండడంతో మరింతగా ఆసక్తి కనబరుస్తున్నది. కాగా, ఆదివారం గన్నవరం విమానాశ్రయం నుండి నేరుగా హోటల్ గేట్‌వేకు వెస్టిండీస్ మహిళా క్రికెటర్లు చేరుకున్నారు. సోమవారం ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు భారత మహిళా క్రికెటర్లు మూలపాడులోని స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట నుండి 4 గంటల వరకు వెస్టిండీస్ సభ్యులు నెట్స్‌లో పాల్గొంటారు. ఇలావుంటే, ఆదివారం నగరానికి చేరుకున్న వెస్టిండీస్ మహిళా క్రికెట్ జట్టు సభ్యులను ఎసిఎ ప్రతినిధులు సాదర స్వాగతం పలికారు. తెలుగు సంస్కృతికి అద్దం పట్టేలా నుదుట కుంకుమను పెట్టి ఆహ్వానించారు. భారత్, విండీస్ మధ్య మూడు వనే్డలు వరుసగా ఈ నెల 10, 13, 16 తేదీల్లో జరుగుతాయ. టి-20 ఫార్మాట్‌లో 18, 20, 22 తేదీల్లో మ్యాచ్‌లు ఉంటాయ. భారత వనే్డ జట్టుకు కెప్టెన్‌గా మిథాలీ రాజ్‌ను కొనసాగిస్తున్నప్పటికీ, టి-20 ఫా ర్మాట్‌లో మాత్రం హర్మన్‌ప్రీత్ కౌర్‌కు సెలక్టర్లు పగ్గాలు అప్పగించారు. అన్ని వి భాగాల్లోనూ ఆమెను భవిష్యత్ కెప్టెన్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతున్నది. ఈ సిరీస్‌లో ఆమె మిథాలీ నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటూ కెప్టెన్‌గా కొత్త బాధ్యతలను నిర్వర్తించనుంది.
భారత వనే్డ జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందనా, తిరుష్ కామిని, మోనా మెష్రామ్, వేదా కృష్ణమూర్తి, ఝూలన్ గోస్వామి, శిఖా పాండే, దేవికా వైద్య, సుష్మా వర్మ, సుకన్యా ఫరీదా, పూనం యాదవ్, ఏక్తా బిస్త్, రాజేశ్వరి గైక్వాడ్, దీప్తీ శర్మ.
భారత టి20 జట్టు: హార్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మందనా, మిథాలీ రాజ్, ఎస్ మేఘన, వెల్లస్వామి వనిత, అనూజా పటేల్, దీప్తీ శర్మ, నుజ్‌హత్ పర్విన్, ఏక్తా బిస్త్, పూనం యాదవ్, ప్రీతీ బోస్, వేదా కృష్ణమూర్తి, ఝూలన్ గోస్వామి, శిఖా పాండే, మన్షీ జోషి
వెస్టిండీస్ జట్టు: స్ట్ఫోనీ టేలర్ (కెప్టెన్), అనీసా మహమ్మద్, మెరిస్సా అగులేరియా, షిమాని చాంబ్లే, షమిల్లా కాన్నల్, బ్రిట్నీ క్రూపర్, దియేంద్ర డోడెన్, అఫీ ఫ్లెచ్చర్, కాసియా నైట్, ఐలే మాథ్యూ, చీడియన్ నేషన్, షక్వానా, ట్రెమీ స్మార్ట్, షకీరా సల్మాన్.