క్రీడాభూమి

ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా పట్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్, నవంబర్ 6: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టుపై దక్షిణాఫ్రికా పట్టు బిగించింది. విజయానికి భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి రావడం, ఇంకా ఒక రోజు ఆట మాత్రమే మిగిలి ఉండడంతో, మ్యాచ్‌ని డ్రా చేసుకోవడానికి ప్రయత్నించడం మినహా ఆసీస్‌కు మరో దారి కనిపించడం లేదు. మ్యాచ్ నాలుగవ రోజు, ఆదివారం ఉదయం మూడు వికెట్లకు 390 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్లకు 540 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీనితో 539 భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. గెలవాలంటే ఇంకా 390 పరుగులు సాధించాలి. ఆరు వికెట్లు చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్న ఉస్మాన్ ఖాజా (58), మిచెల్ మార్ష్ (15) చివరి రోజు ఆటలో ఎంత సేపు అవుట్‌కాకుండా నిలిచి, స్కోరుబోర్డును ముందుకు దూకిస్తారన్న అంశంపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడింది. ఆసీస్ ఇటీవల ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుంటే, గెలవడం అసాధ్యమనే చెప్పాలి. చివరి రోజైన సోమవారం మొత్తం బ్యాటింగ్ చేసి, ఆలౌట్ కాకుండా ఉంటే ఆ జట్టు గెలిచిందనే అనుకోవాలి.

షాదత్‌కు ఊరట
ఢాకా, నవంబర్ 6: మైనర్ బాలికను పనిలో పెట్టుకోవడమేగాక, ఆమెను శారీరకంగా హింసించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ షాదత్ హోస్సేన్‌కు ఊరట లభించింది. అర్ధరాత్రి రోడ్డుపై ఏడుస్తూ ఒక చిన్నపిల్ల కనిపించడంతో పోలీసులు అనుమానంతో ఆమెను ప్రశ్నించినప్పుడు షాదత్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. గత ఏడాది చోటు చేసుకున్న ఈ సంఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు షాదత్, అతని భార్య రిట్టోలపై చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే, వారు బాలికను హించినట్టు చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొంటూ కోర్టు తీర్పునిచ్చింది. ప్రాసిక్యూషన్ తన వాదనను నిరూపించలేకపోవడంతో షాదత్ దంపతులను నిర్దోషులుగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది.