క్రీడాభూమి

9 తర్వాత ఎప్పుడైనా సరే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 6: లోధా కమిటీతో చర్చలకు ఈనెల 9 తర్వాత ఎప్పుడైనా తాను సిద్ధమని బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశాడు. లోధా సిఫార్సులను బోర్డు చాకాలంగా వ్యతిరేకిస్తుండగా, ఏవైనా అభ్యంతరాలుంటే నేరుగా కమిటీతోనే చర్చించాలని సుప్రీం కోర్టు సూచించింది. దీనిపై ఇంత వరకూ స్పందించని ఠాకూర్ ఆదివారం లోధా కమిటీకి లేఖ రాసినట్టు బోర్డు వర్గాలు పిటిఐతో మాట్లాడుతూ చెప్పాయి. కమిటీతో భేటీ కావడానికి, సిఫార్సులను ఎందుకు వద్దనుకుంటున్నదీ వివరించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఠాకూర్ తన లేఖలో పేర్కొన్నాడని ఈ వర్గాలు అన్నాయి. కమిటీ సభ్యులను కలిసి, అభ్యంతరాలను తెలపాల్సిందిగా ఇంతకు ముందే సుప్రీం కోర్టు ఆదేశించినప్పటికీ, అప్పట్లో వర్షాకాల సమావేశాల కారణంగా పార్లమెంటు సభ్యుడైన ఠాకూర్‌కు అది సాధ్యం కాలేదని చెప్పాయి. ఈ విషయమై సుప్రీం కోర్టుకు అతను ఇది వరకే క్షమాపణ చెప్పాడని ఈ వర్గాలు తెలిపాయి. తొమ్మిదో తేదీన ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య మొదటి క్రికెట్ టెస్టు మ్యాచ్ ఆరంభం కానుండగా, ఆతర్వాత ఎప్పుడైనాసరే తాను కమిటీతో భేటీకి సిద్ధంగా ఉంటానని లోధా కమిటీకి ఠాకూర్ తెలిపాయని అన్నాయి. కాగా, లోధా సిఫార్సుల అమలుపై తొమ్మిది తర్విత ఒక స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.