క్రీడాభూమి

హార్దిక్‌కు అవకాశం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, నవంబర్ 6: ఇంగ్లాండ్‌తో ఈనెల తొమ్మిదిన ఇక్కడ ప్రారంభమయ్యే మొదటి టెస్టు మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యను ఆడించే అవకాశాలు ఉన్నట్టు భారత క్రికెట్ జట్టు కోచ్ అనిల్ కుంబ్లే సూచనప్రాయంగా వెల్లడించాడు. బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ పేరును తోసిపుచ్చలేమని అన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ఆడినప్పుడు హార్దిక్ టి-20 ఫార్మాట్‌లో ఏ విధంగా రాణిస్తాడో తెలిసిందని విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కుంబ్లే అన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వనే్డ సిరీస్‌లో అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించిన హార్దిక్ ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్ విభాగాల్లో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడని చెప్పాడు. ధర్మశాలలో అద్భుతంగా బౌల్ చేస్తే, ఢిల్లీలో బ్యాటింగ్ నైపుణ్యాన్ని చాటుకున్నాడని తెలిపాడు. పరిమిత ఓవర్ల ఫార్మెట్స్‌తో నిలకడగా రాణించినందువల్లే అతనికి టెస్టు జట్టులో స్థానం లభించిందన్నాడు. ప్లేయింగ్ ఎలెవెన్‌లో అతని పేరు ఉండవచ్చని అంటూనే, తుది నిర్ణయం జట్టు మేనేజ్‌మెంట్ తీసుకుంటుందని స్పష్టం చేశాడు. టెస్టుల్లో సుమారు 140 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసి, లోయర్ మిడిల్ ఆర్డర్‌లో నిలకడగా పరుగులు రాబట్టే ఆటగాడి అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పాడు. అసాధారణ ప్రతిభాపాటవాలున్న హార్దిక్‌కు తుది జట్టులో స్థానం సంపాదించే అర్హతలన్నీ ఉన్నాయని అన్నాడు.
నాయర్‌కూ మద్దతు
తుది జట్టులోకి ఐదో బౌలర్‌ను తీసుకోవాలా లేక ఆరో బ్యాట్స్‌మన్‌కు అవకాశం ఇవ్వాలా అన్నది ఇంకా నిర్ణయం కాలేదని కుంబ్లే చెప్పాడు. నలుగురు స్పెషలిస్టు బౌలర్ల తర్వాత ఐదో బౌలర్ అవసరమని జట్టు మేనేజ్‌మెంట్ అనుకుంటే, లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ కూడా చేయగల హార్దిక్ మెరుగైన సేవలు అందిస్తాడని అన్నాడు. అయితే, కరుణ్ నాయర్‌కు కూడా అతను మద్దతు ప్రకటించాడు. ఆరో బ్యాట్స్‌మన్‌గా రాణించే సత్తా అతనికి ఉందన్నాడు. దేశవాళీ పోటీల్లో అతను నిలకడగా ఆడుతూ, భారీ స్కోర్లు సాధిస్తున్నాడని ప్రశంసించాడు. భారత్ ‘ఎ’ జట్టులో సభ్యుడిగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు నాయర్ ఆశించిన స్థాయిలో ఆడలేదన్న విమర్శలను ప్రస్తావిస్తూ, అక్కడి నుంచి తిరిగి వచ్చిన వెంటనే, రంజీ ట్రోఫీలో అద్వితీయ ప్రతిభ కనబరిచాడన్న విషయాన్ని మరచిపోకూడదని చెప్పాడు. ఏ జట్టుకైనా నిలకడగా ఆడే వారు అత్యవసరమని అన్నాడు. భారీ స్కోర్లు చేసే సామర్థ్యం నాయర్‌కు ఉందని అన్నాడు. తుది జట్టులో హార్దిక్ లేదా నాయర్‌లో ఎవరు ఉంటారన్న ప్రశ్నికు అతను నేరుగా సమాధానం చెప్పలేదు. వాతావరణం, పిచ్ తీరుతెన్నులు, జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకొని తుది కూర్పు ఉంటుందని స్పష్టం చేశాడు. బ్యాట్స్‌మెన్, బౌలర్ల కాంబినేషన్‌ను ఇంకా ఖరారు చేయలేదని అన్నాడు.
పాక్వియావో హ్యాట్రిక్