క్రీడాభూమి

పాక్వియావో హ్యాట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ వెగాస్, నవంబర్ 6: ఫిలిప్పీన్స్ బాక్సర్ మానీ పాక్వియావో ప్రపంచ బాక్సింగ్స్ సంస్థ (డబ్ల్యుబివో) టైటిల్‌ను వరుసగా మూడోసారి నిలబెట్టుకొని హ్యాట్రిక్ సాధించాడు. మాజీ చాంపియన్ జెస్సీ వర్గాస్‌తో ఇక్కడ జరిగిన ఫైట్‌లో 39 పాక్వియావో మొదటి నుంచే ఆధిపత్యాన్ని కనబరిచాడు. ప్రత్యర్థిపై లెఫ్ట్, రైట్ కాంబినేషన్ హుక్స్‌తో విరుచుకుపడ్డాడు. అతని విజృంభణను అడ్డుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి రావడంతో వర్గాస్ తన సామర్థ్యానికి తగినట్టు ఎదురుదాడి చేయలేకపోయాడు. నిజానికి ఈ ఫైట్‌లో వర్గాస్‌ను మీడియా ఫేవరిట్‌గా పేర్కొంది. కానీ, ఇంతకు ముందు రిటైర్మెంట్‌ను ప్రకటించి, అనంతరం తన నిర్ణయాన్ని మార్చుకొని తిరిగి బాక్సింగ్ రింగ్‌లోకి అడుగుపెట్టిన పాక్వియానో కెరీర్‌లో 59వ విజయాన్ని నమోదు చేశాడు. రిఫరీలంతా ఏకగ్రీవంగా అతనిని విజేతగా ప్రకటించారు. మొత్తం 67 ఫైట్స్‌లో పోటీపడిన పాక్వియావో ఆరు పరాజయాలను చవిచూశాడు. రెండు ఫైట్స్‌లో ఫలితం తేలలేదు.
రికార్డు ఫైట్!
పాక్వియావో, వర్గాస్ మధ్య జరిగిన డబ్ల్యుబివో పోరు రికార్డు ఫైట్‌గా చరిత్ర సృష్టించింది. ఫిలిప్పీన్స్ రాజకీయాల్లో చురుగ్గా ఉన్న పాక్వియావో అక్కడి పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన క్రీడాకారులు చాలా మందే కనిపిస్తారుగానీ, బాక్సర్లు మాత్రం చాలా తక్కువ. మహమ్మద్ అలీ, విటాలీ క్లిచ్కో, అలెక్స్ ఆర్గుయేలో, జాన్ మోరిసే వంటి కొంత మంది రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కానీ, ప్రత్యక్ష రాజకీయాల్లో ఎవరూ నిలదొక్కుకోలేకపోయాడు. ఎన్నికల్లో పోటీ చేసి, ఒక దేశ పార్లమెంటుకు ఎన్నికైన తొలి బాక్సర్‌గా చరిత్ర సృష్టించిన పాక్వియావో ఇప్పుడు మరో రికార్డును నెలకొల్పాడు. బాక్సింగ్ టైటిల్‌ను అందుకున్న మొదటి బాక్సర్‌గా చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకున్నాడు.

లంక కెప్టెన్‌గా తరంగ
కొలంబో, నవంబర్ 6: జింబాబ్వేలో జరిగే ముక్కోణపు వనే్డ సిరీస్‌కు వెటరన్ ఆటగాడు ఉపుల్ తరంగను కెప్టెన్‌గా నియమిస్తున్నట్టు శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి) ప్రకటించింది. వైస్ కెప్టెన్‌గా కుశాల్ పెరెరా సేవలు అందిస్తాడని పేర్కొంది. రెగ్యులర్ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్, వైస్ కెప్టెన్ దినేష్ చండీమల్ ఈ సిరీస్‌కు అందుబాటులో లేకపోవడంతో, ఎస్‌ఎల్‌సి కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సి వచ్చింది. ఈ ముక్కోణపు సిరీస్‌లో శ్రీలంక, జింబాబ్వేతోపాటు వెస్టిండీస్ కూడా పాల్గొంటుంది.
సౌరభ్‌కు నిరాశే
సార్‌బ్రకెన్ (జర్మనీ), నవంబర్ 6: భారత ఆటగాడు సౌరవ్ వర్మ ఇక్కడ జరిగిన పిట్‌బర్గర్ ఓపె న్ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో ఓటమిపాలై, రన్నర్ ట్రోఫీతో సరిపు చ్చుకున్నాడు. టైటిల్ పోరులో చైనాకు చెందిన షి యుకీ 21-19 22-20 తేడాతో సౌరభ్‌ను ఓ డించాడు. ఇటీవల కాలంలో అతను ఫైనల్ చేరి నప్పటికీ టైటిల్‌ను సాధించలేకపోవడం ఇది వ రుసగా నాలుగోసారి.