క్రీడాభూమి

షాజాద్ విజృంభణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షార్జా, జనవరి 11: వికెట్‌కీపర్ మహమ్మద్ షాజాద్ విజృంభణ జింబాబ్వేతో జరిగిన రెండవ, చివరి టి-20లో అఫ్గానిస్థాన్‌ను విజయపథంలో నడిపించింది. 81 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన అఫ్గాన్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఓపెనర్‌గా వచ్చిన షాజాద్ అజేయంగా 118 పరుగులు చేసి, టి-20 చరిత్రలోనే నాలుగో అత్యధిక స్కోరును నమోదు చేశాడు. 2013లో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్ 156 పరుగులు చేసి అత్యధిక స్కోరు రికార్డును నెలకొల్పాడు. అంతకు ముందు, 2012లో పల్లేకల్‌లో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ ప్రస్తుత కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ 123 పరుగులు సాధించాడు. గత ఏడాది జనవరిలో వెస్టిండీస్‌తో జొహానె్నస్‌బర్గ్‌లో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ ఫఫ్ డు ప్లెసిస్ 119 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ల జాబితాలో అతను మూడో స్థానంలో ఉండగా, ఆ రికార్డును సమం చేసే అవకాశాన్ని షాజాద్ కేవలం ఒక పరుగు తేడాతో కోల్పోయాడు. 67 బంతులు ఎదుర్కొన్న అతను 10 ఫోర్లు, 8 సిక్సర్లతో అజేయంగా 118 పరుగులు సాధించి జాబితాలో నాలుగో స్థానాన్ని ఆక్రమించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్‌కు షాజాద్ అండగా నిలిచాడు. అతని విజృంభణతో ఆ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 215 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. అనంతరం బ్యాటిగ్‌కు దిగిన జింబాబ్వే 18.1 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. హామిల్టన్ మసకజా (63), పీటర్ మూర్ (35) తప్ప మిగతా వారు రాణించలేకపోయారు. వీరితోపాటు టెండయి చిసొరో (10) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగాడు. అఫ్గాన్ బౌలర్లలో దౌలత్ జద్రాన్, అమీర్ హమ్జా, సయ్యద్ షిర్జాద్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. రెండు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌ను అఫ్గాన్ 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది.
సంక్షిప్త స్కోర్లు
అఫ్గానిస్థాన్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 6 వికెట్లకు 215 (మహమ్మద్ షాజాద్ 118, మహమ్మద్ నబీ 22).
జింబాబ్వే ఇన్నింగ్స్: 18.1 ఓవర్లలో 134 ఆలౌట్ (హామిల్టన్ మసకజా 63, పీటర్ మూర్ 35, జద్రాన్ 2/21, హమ్జా 2/15, షిర్జాద్ 2/31).