క్రీడాభూమి

వికెట్లు సాధించడం ఎలాగో నేర్చుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 7: భారత పేస్ బౌలర్ ఇశాంత్ శర్మ ప్రతిభావంతుడైన ఆటగాడే అయినప్పటికీ వికెట్లు సాధించేలా మరింత నిలకడగా బంతులు వేయడం ఎలాగో నేర్చుకోవాల్సిన అవసరం ఉందని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. చికున్‌గున్యా వ్యాధి కారణంగా ఇటీవల న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైన ఇశాంత్ శర్మ ఈ నెల 9వ తేదీ నుంచి ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో తలపడే భారత జట్టులో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే కెరీర్‌లో ఇప్పటివరకూ 72 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఇశాంత్ శర్మ దాదాపు 11.3 ఓవర్లకు ఒక వికెట్ చొప్పున 66.6 స్ట్రైక్ రేటుతో 209 వికెట్లు మాత్రమే సాధించడంతో అతను మరింత నిలకడగా రాణించాల్సిన అవసరం ఉందని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. ‘పొడగరి అయిన ఇశాంత్ శర్మ మంచి బౌలరే. ఎత్తుకు తగ్గట్టు అతను చక్కగానే బౌలింగ్ చేస్తున్నాడు. కానీ కీలక సమయాల్లో వికెట్లు సాధించేలా డెలివరీలు (బంతులు) వేయడంలో అతను సరిగా సఫలీకృతం కాలేకపోతున్నాడు. ఈ విషయంలో అతను నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇశాంత్‌లో ఇదొక్కటే లోపంగా కనిపిస్తోంది. ఇంతకు మించి అతనిలో ప్రతిభకు ఏమాత్రం కొదవ లేదు’ అని భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో కపిల్ దేవ్ పిటిఐ వార్తా సంస్థకు వివరించాడు.
వనే్డ క్రికెట్‌లో భారత్‌కు తొలి ప్రపంచ కప్‌ను అందించిన కపిల్ దేవ్ కేవలం 83 టెస్టుల్లోనే 300 వికెట్ల మైలురాయిని అధిగమించిన విషయం తెలిసిందే. వీటిలో ఎక్కువ వికెట్లు బ్యాటింగ్‌కు ఎంతగానో అనుకూలించే భారత పిచ్‌లపై సాధించనవే ఉన్నాయి. అయితే మైదానంలో ప్రత్యర్థుల భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు ఇశాంత్ శర్మ ఏమి చేయాలని ప్రశ్నించగా, బౌలింగ్ విషయంలో అతను మరింత క్రమశిక్షణతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని తాను భావిస్తున్నట్లు కపిల్ చెప్పాడు. ‘ఎవరైనా బౌలింగ్‌లో రాణించాలంటే మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో నిలకడగా బంతులు వేయాలి. ఒక ఓవర్‌లో కేవలం ఒకటి లేదా రెండు బంతులు అలా వేస్తే సరిపోదు. కనీసం ఐదు బంతులైనా మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో వేయాలి. అప్పుడే ఎవరైనా ఎక్కువ వికెట్లు
సాధించగలుగుతారు’ అని కపిల్ దేవ్ స్పష్టం చేశాడు. టెస్టు కెరీర్‌లో మొత్తం 434 వికెట్లు, మరో 5 వేలకు పైగా పరుగులు సాధించిన కపిల్ దేవ్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత గత 22 ఏళ్ల నుంచి ‘మరో కపిల్ దేవ్’ కోసం అనే్వషిస్తున్నామని భారత సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్‌కె.ప్రసాద్ ఇటీవల ఒక సందర్భంలో చెప్పాడు.
యువ ఆటగాడు హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్‌గా టెస్టుల్లో అరంగేట్రం చేసేందుకు ఎదురుచూస్తున్న విషయం గురించి కపిల్ ప్రస్తావిస్తూ, ప్రస్తుతం భారత జట్టు ఆడుతున్న క్రికెట్ పరిమాణాన్ని మన ఆటగాళ్లు అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ సమాన స్థాయిలో విజయవంతం కావడం కష్టమనిపిస్తోందని చెప్పాడు. ‘నేడు క్రికెట్‌కు డిమాండ్ ఎంతో పెరిగడంతో ఆటగాళ్లు సంవత్సరానికి కనీసం పది నెలల పాటు ఆడుతూ పదేపదే గాయాల బారిన పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల నడుమ ఏ ఆల్‌రౌండర్ అయినా రెండు విభాగాల్లోనూ రాణించడం అంత తేలిక కాదు’ అని కపిల్ స్పష్టం చేశాడు. హార్దిక్ పాండ్యాను ‘తదుపరి కపిల్ దేవ్’గా పరిగణించవచ్చా? అని ప్రశ్నించగా, ఎవరనీ వెతకనక్కర్లేదని, ఎవరైనా సొంత శక్తి, సామర్ధ్యాలతోనే రాణించగలుగుతారని కపిల్ పేర్కొంటూ, మరో సచిన్ తెండూల్కర్‌ను గానీ, సునీల్ గవాస్కర్‌ను గానీ భారత్ వెతకగలదా? అని ఎదురు ప్రశ్నించాడు.