క్రీడాభూమి

చరిత్ర సృష్టించిన వృషభ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 8: జార్ఖండ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టుకు చెందిన యువ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ వృషభ్ పంత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం 48 బంతుల్లోనే వంద పరుగులు పూర్తిచేసి ఫస్ట్‌కాస్ క్రికెట్‌లో అత్యంత వేగవంతంగా శతకాన్ని నమోదు చేసిన భారత ఆటగాడిగా అతను రికార్డులకు ఎక్కాడు. కేరళలోని తుంబాలో జరిగిన ఈ మ్యాచ్‌లో మంగళవారం అతను మొత్తం మీద 67 బంతులను ఎదుర్కొని 13 సిక్సర్లు, మరో ఎనిమిది ఫోర్ల సాయంతో 135 పరుగులు సాధించి నిష్క్రమించాడు. ప్రస్తుత సీజన్‌లో అతనికి ఇది నాలుగో సెంచరీ. అద్భుతమైన ప్రదర్శనతో దూసుకెళ్తున్న వృషభ్ పంత్ ఈ సీజన్‌లో ఇప్పటివరకూ ఏడు ఇన్నింగ్స్ ఆడి వరుసగా 146, 308, 24, 9, 60, 117, 135 చొప్పున పరుగులు రాబట్టి, 133.16 సగటు, 113.17 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 799 పరుగులు సాధించడం విశేషం. ప్రస్తుతం అతను సాధించిన ఫీట్‌తో తమిళనాడు మాజీ ఓపెనర్ విబి.చంద్రశేఖర్ 28 ఏళ్ల క్రితం 56 బంతుల్లో వేగవంతంగా మూడంకెల స్కోరును చేరుకుని నెలకొల్పిన రికార్డు చెరిగిపోయింది. 1988-89 సీజన్‌లో ఇరానీ కప్ టోర్నీలో భాగంగా రెస్ట్ఫా ఇండియా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చంద్రశేఖర్ ఈ ఫీట్ సాధించడంతో 1990లో న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులో ఆయనకు చోటు లభించింది.
కాగా, ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో అత్యంత వేగవంతంగా సెంచరీ నమోదు చేసిన క్రికెటర్‌గా ఆస్ట్రేలియాకు చెందిన దివంగత ఆటగాడు డేవిడ్ హూక్స్ ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా 1982లో అడిలైడ్ ఓవల్‌లో జరిగిన మ్యాచ్‌లో విక్టోరియా జట్టుపై సౌత్ ఆస్ట్రేలియా జట్టు తరఫున ఆడిన హూక్స్ కేవలం 34 బంతుల్లోనే 100 పరుగులు పూర్తిచేసి ఈ రికార్డు నెలకొల్పాడు.