క్రీడాభూమి

ఉత్తమ బౌలర్ ఎవరో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్, జనవరి 11: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వనే్డ, టి-20 సిరీస్‌లతోపాటు బౌలర్లు, బ్యాట్స్‌మెన్ మధ్య ఆధిపత్య పోరాటం కూడా కొనసాగనుంది. భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఆసీస్ ఫాస్ట్ బౌలర్ జొస్ హాజెల్‌వుడ్ బౌలర్ల రేసులో ముందు వరుసలో ఉన్నారు. అశ్విన్ ఇప్పటికే అత్యుత్తమ బౌలర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వనే్డ, టి-20 సిరీస్‌లలో భారత బౌలర్లంతా మూకుమ్మడిగా విఫలమైనప్పటికీ, అశ్విన్ ఒక్కడే అద్వితీయ ప్రతిభను కనబరించాడు. చాలా మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగలిగాడు. పరిమిత ఓవర్ల ఫార్మెట్ తర్వాత జరిగిన టెస్టు సిరీస్‌లో ఏకంగా 31 వికెట్లు పడగొట్టి, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు. తిరుగులేని ఫామ్‌లో ఉన్న అతనితో హాజెల్‌వుడ్ తీవ్రంగా పోటీపడుతున్నారు. ఒక రకంగా తమతమ జట్ల బౌలింగ్ విభాగాన్ని వీరిద్దరూ తమ భుజాలపైకి ఎత్తుకొని సిరీస్‌లో అడుగుపెడుతున్నారు. భారత్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, ఆసీస్ బౌలర్లలో జేమ్స్ ఫాల్క్‌నెర్ కూడా ఆధిపత్యం రేసులో ఉన్నప్పటికీ, పోటీ ప్రధానంగా అశ్విన్, హాజెల్‌వుడ్ మధ్యే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
కోహ్లీ, స్మిత్ పోటీ!
బ్యాట్స్‌మెన్ విభాగంలో భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ మధ్య పోటీ నెలకొంది. టీమిండియా వనే్డ కెప్టెన్‌గా ధోనీ వ్యవహరిస్తున్నప్పటికీ, అతని కంటే ఎక్కువగా కోహ్లీనే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తనదైన రోజున ఎలాంటి బౌలింగ్‌నైనా చిత్తుచేసే శక్తిసామర్థ్యాలు కోహ్లీకి ఉంటే, నిలకడగా రాణించడం, జట్టు అవసరాలకు అనుగుణంగా బ్యాటింగ్ శైలిని మార్చుకోవడం స్మిత్ లక్షణాలు. భారత్ బ్యాట్స్‌మెన్‌లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ కూడా సమర్థులైనప్పటికీ, అభిమానుల చూపు కోహ్లీపైనే కేంద్రీకృతమైంది. స్మిత్‌తో జరిగే పోరులో అతను ఏ విధంగా గెలుస్తాడో వేచిచూడాల్సిందే.