క్రీడాభూమి

శతకాల మోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, నవంబర్ 10: సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో గురువారం మరో రెండు శతకాలు నమోదయ్యాయి. రెండో రోజు ఆటలో ఇద్దరు, మొత్తం మీద ముగ్గురు బ్యాట్స్‌మెన్ సెంచరీలు సాధించడంతో, భారత్‌తో ఇక్కడ జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 537 పరుగుల భారీ స్కోరును నమోదు చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్, రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టం లేకుండా 63 పరుగులు చేసింది. నాలుగు వికెట్లకు 311 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను ఆరంభించిన కొద్ది సేపటికే మోయిన్ అలీ సెంచరీ పూర్తి చేశాడు. బుధవారం 99 పరుగులతో క్రీజ్‌లో ఉన్న అతను శతకం పూర్తయిన తర్వాత ఎక్కువ సేపు అదే ఒరవడిని కొనసాగించలేకపోయాడు. 213 బంతులు ఎదుర్కొని పదమూడు ఫోర్లతో 117 పరుగులు చేసి మహమ్మద్ షమీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. మొదటి రోజు ఆటలో కాలి కండరాలు బెణకడంతో ఓవర్‌ను పూర్తి చేయలేకపోయిన షమీ గురువారం ఆటలో ఎలాంటి ఇబ్బంది లేకుండా బంతులు వేసి, అభిమానుల ఆందోళనకు తెరదించాడు. మొయిన్‌కు అండగా నిలిచిన బెన్ స్టోక్స్ ఆతర్వాత జానీ బెయిర్‌స్టోతో కలిసి జట్టు స్కోరు 400 పరుగుల మైలురాయిని దాటించాడు. జట్టు స్కోరు 442 పరుగుల వద్ద బెయిర్‌స్టో (46)ను వృద్ధిమాన్ సాహా క్యాచ్ అందుకోగా షమీ అవుట్ చేశాడు. క్రిస్ వోక్స్ (4), అదిల్ రషీద్ (5) సింగిల్ డిజిట్స్‌కే పరిమితమయ్యారు. స్టోక్స్ 235 బంతుల్లో 128 పరుగులు సాధించి, ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో వృద్ధిమాన్ సాహాకు చిక్కాడు. అతని స్కోరులో 13 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. జాఫర్ అన్సారీ 32 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద అమిత్ మిశ్రా బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరగ్గా, ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌కు 537 పరుగుల వద్ద తెరపడింది. అప్పటికి స్టువర్ట్ బ్రాడ్ ఆరు పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. షమీ, ఉమేష్ యాదవ్, అశ్విన్ తలా ఒక వికెట్ తమతమ ఖాతాల్లో వేసుకున్నారు.
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత భారత్ బ్యాటింగ్‌ను మురళీ విజయ్, గౌతం గంభీర్ ప్రారంభించారు. 23 ఓవర్లలో వీరు వికట్ నష్టం లేకుండా 63 పరుగులు చేశారు. ఆట ముగిసే సమయానికి విజయ్ 25, గంభీర్ 28 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

* భారత్‌లో ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఐదు వందలకుపైగా పరుగులు చేయడం 1985 తర్వాత ఇదే మొదటిసారి. అప్పట్లో చెన్నైలో జరిగిన టెస్టులో ఇంగ్లాండ్ 652 పరుగులు సాధించింది. కాగా, భారత్‌లో ఒక విదేశీ జట్టుకు చెందిన ముగ్గురు బ్యాట్స్‌మెన్ ఒకే ఇన్నింగ్స్‌లో శతకాలు నమోదు చేయడం 2009 తర్వాత ఇదే మొదటిసారి. ఇంగ్లాండ్ కంటే ముందు మొతేరా టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఏడు వికెట్లకు 760 పరుగుల స్కోరువద్ద డిక్లేర్ చేసింది. తిలకరత్నే దిల్షాద్ (112), మహేల జయవర్ధనే (275), ప్రసన్న జయవర్ధనే (154 నాటౌట్) శతకాలతో కదంతొక్కారు. కాగా, భారత్ పర్యటనలో ఉన్న ఒక విదేశీ జట్టుకు చెందిన ఆరుగురు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో కనీసం 25 పరుగులు చొప్పున చివరిసారి 2008లో చేశారు. ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో జరిగిన ఆ టెస్టులో ఆస్ట్రేలియా ఈ ఫీట్‌ను నమోదు చేసింది. ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు ఇంగ్లాండ్‌లో ఆరుగురు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కనీసం పాతిక పరుగులు చేశారు.

స్కోరుబోర్డు
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 4 వికెట్లకు 311): అలిస్టర్ కుక్ ఎల్‌బి రవీంద్ర జడేజా 21, హసీబ్ హమీద్ ఎల్‌బి అశ్విన్ 31, జో రూట్ సి అండ్ బి ఉమేష్ యాదవ్ 124, బెన్ డకెట్ సి ఆజింక్య రహానే బి అశ్విన్ 13, మోయిన్ అలీ నాటౌట్ బి మహమ్మద్ షమీ 117, బెన్ స్టోక్స్ సి వృద్ధిమాన్ సాహా బి ఉమేష్ యాదవ్ 128, జానీ బెయిర్‌స్టో సి వృద్ధిమాన్ సాహా బా మహమ్మద్ షమీ 46, క్రిస్ వోక్స్ సి వృద్ధిమాన్ సాహా బి రవీంద్ర జడేజా 4, అదిల్ రషీద్ సి ఉమేష్ యాదవ్ బి రవీంద్ర జడేజా 5, జాఫర్ అన్సారీ ఎల్‌బి అమిత్ మిశ్రా 32, స్టువర్ట్ బ్రాడ్ 6 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 10, మొత్తం 537 ఆలౌట్.
వికెట్ల పతనం: 1-47, 2-76, 3-102, 4-281, 5-343, 6-442, 7-451, 8-465, 9-517, 10-537.
బౌలింగ్: మహమ్మద్ షమీ 28.1-5-65-2, ఉమేష్ యాదవ్ 31.5-3-112-2, అశ్విన్ 46-3-167-2, రవీంద్ర జడేజా 30-4-86-3, అమిత్ మిశ్రా 23.3-3-98-1.
భారత్ తొలి ఇన్నింగ్స్: మురళీ విజయ్ 25 నాటౌట్, గౌతం గంభీర్ 28 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 10, మొత్తం (23 ఓవర్లలో వికెట్ నష్టం లేకుండా) 63.
బౌలింగ్: స్టువర్ట్ బ్రాడ్ 5-1-20-0, క్రిస్ వోక్స్ 7-2-17-0, మోయన్ అలీ 6-2-6-0, జఫర్ అన్సారీ 3-0-3-0, అదిల్ రషీద్ 2-0-8-0.