క్రీడాభూమి

నాలుగు దేశాల హకీ టోర్నీకి భారత జట్టు ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, నవంబర్ 11: ఆస్ట్రేలియా ఈనెల చివరిలో మొదలయ్యే నాలుగు దేశాల హాకీ టోర్నమెంట్‌కు భారత జట్టును ఎంపిక చేశారు. రెగ్యులర్ గోల్‌కీపర్ శ్రీజేష్ గాయపడడంతో, అతని స్థానంలో డ్రాగ్ ఫ్లికర్ విఆర్ రఘునాథ్‌కు పగ్గాలు అప్పగించారు. కువాంటన్ (మలేసియా)లో జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ ఫైనల్‌లో కొరియాను ఢీకొన్న భారత్ విజయభేరి మోగించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో శ్రీజేష్ మోకాలికి గాయమైంది. ఆ టోర్నీలో ఆడని రఘునాథ్ ఇప్పుడు గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో జట్టులోకి తిరిగి రావడమేగాక, కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. శ్రీజేష్ లేని కారణంగా, రియో ఒలింపిక్స్‌లో స్టాండ్‌బై గోల్‌కీపర్‌గా ఉన్న ఆకాష్ చిక్తేను నాలుగు దేశాల టోర్నీలో కీపర్‌గా ఎంపిక చేశారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అభినవ్ కుమార్ స్టాండ్‌బై కీపర్‌గా ఉంటాడు. యువ ఆటగాడు రూపీందర్‌పాల్ సింగ్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.