క్రీడాభూమి

ఎఫ్‌ఐహెచ్ అధ్యక్షుడిగా బాత్రా ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, నవంబర్ 12: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) 45వ అధ్యక్షుడిగా నరీందర్ బాత్రా ఎన్నికయ్యాడు. మొత్తం 118 సభ్య దేశాలున్న ఎఫ్‌ఐహెచ్ వార్షిక సమావేశంలో 110 మంది ప్రతినిధులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. బాత్రాకు 68 ఓట్లు లభించగా, అతనితో పోటీకి ది గిన డేవిడ్ బల్బర్నీ (ఐర్లాం డ్)కు 29, కెన్ రీడ్ (ఆస్ట్రేలి యా)కు 13 చొప్పున ఓట్లు దక్కాయి. తిరుగులేని ఆధిక్యంతో విజయభేరి మోగించిన బాత్రా ఎఫ్‌ఐహెచ్ 12వ అధ్యక్షుడిగా ఎన్నికైన ఐరోపాకు చెందని తొలి అభ్యర్థి కావడం విశేషం. హాకీ ఇండియాకు మొదట కార్యదర్శిగా సేవలు అందించిన అతను 2014లో అధ్యక్ష పదవిని చేపట్టాడు. దేశ హాకీ రంగంపై తనదైన ముద్ర వేశాడు. ఆతర్వాత అంతర్జాతీయ హాకీపైనా పట్టు సంపాదించాడు. ఈ విజయంతో, లియోనాడ్రే నెగ్రే స్థానంలో ఎఫ్‌ఐహెచ్ అధ్యక్ష స్థానంలో కూర్చుంటాడు. కాగా, పాలక మండలికి రెనె ఫ్రాంక్, ఇటినే గిల్‌క్రిచ్, జువాన్ ఆంటానియో కాల్జడో, ఎల్స్ వాన్ బ్రెడా వీస్మన్ సభ్యులుగా ఎన్నికయ్యారు.
పాక్‌తో క్రీడా సంబంధాలు..
పాకిస్తాన్‌తో క్రీడా సంబంధాలను కొనసాగించాలని బాత్రా అభిప్రాయపడ్డాడు. ఎఫ్‌ఐహెచ్ అధ్యక్షుడిగా ఎన్నికైన అతను పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అంతర్జాతీయ వేదికలపై పాక్‌తో భారత్ మ్యాచ్‌లు ఆడాల్సిందేనని అన్నాడు. రెండు దేశాలకూ అంతర్జాతీయ షెడ్యూల్‌ను అనుసరించాల్సిన అవసరం ఉందన్నాడు. వాటికి అనుగుణంగానే మ్యాచ్‌లు ఆడాలని చెప్పాడు. హాకీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చాడు.