క్రీడాభూమి

ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ మొదటి గేమ్ డ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, నవంబర్ 12: టైటిల్ హోల్డర్ మాగ్నస్ కార్ల్‌సెన్ (నార్వే), చాలెంజర్ సెర్గీ కర్జాకిన్ (రష్యా) మధ్య మొదలైన ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో తొలి గేమ్ డ్రాగా ముగిసింది. ఇరువురు ఆటగాళ్లకు చెరి అర పాయింట్ లభించింది. చాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న ఎలాంటి ఒత్తిడి లేకుండా పావులను కదిలించాడు. మొదటి గేమ్ కావడంతో కర్జాకిన్ కూడా దూకుడుగా ఆడకుండా సంయమనం ప్రదర్శించాడు. దీనితో ఏ మాత్రం ఉత్కంఠను రేపని తొలి గేమ్ డ్రాగా అయింది.

గోల్‌కీపర్ ఆఫ్ ది ఇయర్
రేసులో శ్రీజేష్
దుబాయ్, నవంబర్ 12: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ఏటా ప్రకటించే గోల్‌కీపర్ ఆఫ్ ది ఇయర్ రేసులో ఈసారి భారత గోల్‌కీపర్ శ్రీజేష్ కూడా చేరాడు. భారత జట్టుకు రెగ్యులర్ కెప్టెన్‌గా సేవలు అందిస్తున్న అతను ఇటీవల కువాంటన్ (మలేసియా)లో జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ను దక్షిణ కొరియాతో ఆడుతున్న సమయంలో గాయపడ్డాడు. మోకాలి నొప్పి ఇంకా తగ్గకపోవడంతో, నాలుగు దేశాల టోర్నీలో ఆడే భారత జట్టుకు రఘునాథ్‌ను కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఇలావుంటే, పురుషులు, మహిళల విభాగంలో భారత్ తరఫున శ్రీజేష్ మినహా క్రీడాకారులుగానీ, కోచ్‌లుగానీ అవార్డుల ప్రతిపాదిత జాబితాలో లేరు.