క్రీడాభూమి

వారికీ అవకాశమివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, జనవరి 12: స్పాట్ ఫిక్సింగ్‌లో ముద్దాయిగా తేలడంతో జైలు శిక్షతోపాటు సస్పెన్షన్ వేటును కూడా ఎదుర్కొన్న మహమ్మద్ అమీర్‌కు మళ్లీ జాతీయ జట్టులో స్థానం దక్కడంపై పాకిస్తాన్ జాతీయ కోచ్, మాజీ పేసర్ వకార్ యూనిస్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇదే కేసులో అమీర్‌తోపాటు దోషులైన మాజీ కెప్టెన్ సల్మాన్ బట్, ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆసిఫ్‌లకు కూడా అమీర్ మాదిరిగానే మరో అవకాశం ఇవ్వాలని ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పాడు. చేసిన పొరపాటుకు వారు శిక్ష అనుభవించారని, బేషరతుగా క్షమాపణ కూడా చెప్పారని అన్నాడు. మారిన వారిని క్షమించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించాడు. బట్, ఆసిఫ్‌లకు కూడా జాతీయ జట్టులో స్థానం కల్పిస్తే, ఆ చర్యను తాను స్వాగతిస్తానని అన్నాడు.
హాంకాంగ్ క్రికెటర్‌పై సస్పెన్షన్ వేటు
హాంకాంగ్, జనవరి 12: హాంకాంగ్ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ అహ్మద్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) సస్పెన్షన్ వేటు వేసింది. మ్యాచ్ ఫిక్సింగ్ చేయాల్సిందిగా కోరుతూ బుకీలు తనను కలిసిన విషయాన్ని అధికారులకు చెప్పకుండా గోప్యంగా ఉంచినందుకు 26 ఏళ్ల ఇర్ఫాన్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. నేరం రుజువైతే అతనికి రెండు నుంచి ఐదేళ్ల వేటు పడే అవకాశాలున్నాయి.