క్రీడాభూమి

మిథాలీ కెప్టెన్ ఇన్నింగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 13: భారత్, వెస్టిండీస్ మహిళల జట్ల మధ్య జరుగుతున్న వనే్డ క్రికెట్ సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో వనే్డలో భారత మహిళా జట్టు 72 బంతులు మిగిలి ఉండగానే, ఐదు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మూలపాడులోని దేవినేని వెంకటరమణ, ప్రణీత క్రికెట్ గ్రౌండ్స్‌లో జరిగిన రెండో వనే్డలో వెస్టిండీస్‌పై అన్ని విభాగాల్లో అధిక్యాన్ని ప్రదర్శించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. దీనితో బుధవారం జరిగే చివరిదైన మూడో వనే్డకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండాపోయంది. ఆదివారం నాటి పోరులో భారత బ్యాట్స్‌విమెన్ దీప్తి శర్మ, స్మృతి మందానా మూడో వికెట్‌కు 111 బంతుల్లో 63 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి, భారత్ విజయానికి నాంది పలికారు. మిథాలీ రాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఎలాంటి సమస్య లేకుండా భారత్‌కు విజయాన్ని సాధించిపెట్టింది. టాస్ గెలిచిన మిథాలీ వెస్టిండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వనించింది. ఈ ఆహ్వానంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 50 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి 153 పరుగులు చేసింది. అనంతరం భారత్ 38 ఓవర్లలో ఐదు వికెట్లకే 154 పరుగులు చేసి, విజయభేరి మోగించింది.
తొలి వికెట్‌కు షాక్వానా క్విన్‌టైన్‌తో కలిసి 16 పరుగులు జోడించిన ఓపెనర్ హీలీ మాథ్యూస్ ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద ఝూలన్ గోస్వామి బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగింది. కొద్దిసేపటికే క్విన్‌టైన్ కూడా పెవిలియన్ చేరింది. ఆమె 12 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్లతో సాయంతో తొమ్మిది పరుగులు చేసింది. కెప్టెన్ స్ట్ఫోనీ టేలర్ 42 బంతుల్లో 15, కాసియా నైట్ 56 బంతుల్లో 15 చొప్పున పరుగులు చేసి అవుటయ్యారు. 58 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయ కష్టల్లో పడిన వెస్టిండీస్‌ను ఆల్‌రౌండర్ దియేంద్రా డాటిన్ 101 బంతుల్లో 63 పరుగులు చేసి ఆదుకుంది. ఆమె స్కోరులో ఆరు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయ. వికెట్ కీపర్ మెరిసా ఆక్విలెరియా 52 బంతుల్లో, రెండు ఫోర్లతో 25 పరుగులు చేసింది. షెర్మయన్ క్యాంప్‌బెల్ ఐదు పరుగులు చేసి, ఇన్నింగ్స్ చివరి బంతికి అవుటైంది. అప్పటికి అఫీ ఫ్లెచర్ ఐదు పరుగులతో నాటౌట్‌గా ఉంది. భారత బౌలర్లలో ఎక్తా బిస్త్, ఝూలన్ గోస్వామి చెరి 28 పరుగులిచ్చి, రెండేసి వికెట్లు తీసుకున్నారు.
సాదాసీదాగా కనిపిస్తున్న 154 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు బ్యాటింగ్‌లో ఓపెనర్ స్మృతి మందానా చెలరేగి ఆడింది. రెండో బంతినే ఫోర్‌గా మర్చేసి స్కోర్‌ను ప్రారంభించింది. అయతే, మరో హార్డ్ హిట్టర్ తిరుష్ కామినీ కేవలం రెండు పరుగులు చేసి, అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్‌గా అవుటైంది. రన్ తీసుకోవడానికి ప్రయత్నించిన ఆమెను నాన్‌స్ట్రయకింగ్ ఎండ్‌లో ఉన్న మందానా వారించింది. దీనితో తిరిగి క్రీజ్‌లోకి వెళ్లే క్రమంలో వికెట్‌పై పరుగు తీసిన కామినీ కాలికి బంతి తగిలింది. ఆమె ఉద్దేశపూర్వకంగానే బంతిని అడ్డుకుందని విండీస్ ప్లేయర్స్ చేసిన అప్పీల్‌పై అంపైర్ సానుకూలంగా స్పందించడంతో భారత్ తొలి వికెట్ 23 పరుగుల వద్ద కూలింది. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి, విండీస్ బౌలర్లపై విరుచుకుపడిన దీప్తి శర్మ 63 బంతుల్లో 32 పరుగులు చేసి అవుటైంది. ఆమె స్కోరులో నాలుగు ఫోర్లు ఉన్నాయ. ఓపెనర్ మందానా 62 బంతులు ఎదుర్కొని, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 44పరుగులు చేసి, హేలీ మాథ్యూస్ బౌలింగ్‌లో డోటిన్‌కు చిక్కింది. మిథాలీ రాజ్ 51 బంతుల్లో ఆరు పోర్లు, ఒక సిక్స్‌తో 45పరుగులు చేసి, జట్టును విజయం అంచుకు చేర్చింది. అంతకు ముందే, టి-20 ఫార్మాట్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆరు పరుగులు చేసి పెవిలియన్ చేరింది. చివరిలో వేదా కృష్ణమూర్తి (8), శిఖా పాండే (1) నాటౌట్‌గా నిలిచి, భారత్‌ను లక్ష్యానికి చేర్చారు. 38 ఓవర్లలోనే విజయాన్ని సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను సొంతం చేసుకుంది. రెండు జట్ల మధ్య చివరి వనే్డ బుధవారం జరుగుతుంది.
సంక్షిప్త స్కోర్లు
వెస్టిండీస్ ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 7 వికెట్లకు 153 (దియేంద్రా డాటిన్ 63, మెరిసా ఆక్విలెరియా 25, ఝూలన్ గోస్వామి 2/28, ఎక్తా బిస్త్ 2/28).
భారత్ ఇన్నింగ్స్: 38 ఓవర్లలో ఐదు వికెట్లకు 154 (స్మృతి మందానా 44, దీప్తి శర్మ 32, మిథాలీ రాజ్ 45).

చిత్రాలు..మిథాలీ రాజ్ (45)