క్రీడాభూమి

రికార్డుల కెప్టెన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్: ఇంగ్లాండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ అసాధారణ సెంచరీతో పలు రికార్డులను నమోదు చేశాడు. భారత్‌లో టీమిండియాపై అతను ఐదోసారి సెంచరీ చేశాడు. మన దేశంలో మరే ఇతర జట్టు బ్యాట్స్‌మెన్ ఇన్ని శతకాలు సాధించలేదు. వెస్టిండీస్‌కు చెందిన ఎవర్టన్ వీక్స్, క్లెయివ్ లాయిడ్, దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ హషీం ఆమ్లా తలా నాలుగు పర్యాయాలు భారత్‌లో టెస్టు సెంచరీలు చేశారు. కాగా, భారత్‌లో 1,000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన విదేశీ క్రికెటర్ల జాబితాలో నాలుగో వాడిగా కుక్ పేరు కూడా చేరింది.
ఒక టెస్టు మూడో ఇన్నింగ్స్‌లో కుక్ సెంచరీ చేయడం ఇది 12వ సారి. ఈ విభాగంలో అతను కుమార సంగక్కరతో కలిసి రికార్డును పంచుకుంటున్నాడు. అంతేగాక, అత్యధిక సెంచరీలు చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్‌గా కుక్ మరో రికార్డు సృష్టించాడు. కెప్టెన్‌గా గ్రాహం గూచ్ 11 సెంచరీలు చేస్తే, అదే హోదాలో కుక్‌కు ఇది 12వ శతకం. ఈ క్యాలండర్ ఇయర్‌లో 1,000 పరుగులను అతను పూర్తి చేశాడు. ఈ ఫీట్‌ను ప్రదర్శించడం అతనికిది ఐదోసారి.