క్రీడాభూమి

ఇద్దరు ఫెయిల్.. ఒకరే పాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్, జనవరి 12: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మంగళవారం వాకా స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్‌తో మొత్తం ముగ్గురు క్రికెటర్లు వనే్డ ఇంటర్నేషనల్స్‌లో అరంగేట్రం చేశారు. వీరిలో ఇద్దరు ఆస్ట్రేలియన్లుకాగా, ఒకరు భారత ఆటగాడు. ఒకేసారి వనే్డ కెరీర్‌ను మొదలుపెట్టిన ఈ ముగ్గురు బౌలర్లలో బరీందర్ శరణ్ సఫలంకాగా, స్కాట్ బోలాండ్, జోల్ పారిస్ దారుణంగా విఫలమయ్యారు. శరణ్ 9.2 ఓవర్లు బౌల్ చేసి, 56 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టి, తనకు ఉజ్వల భవిష్యత్తు ఉందని నిరూపించుకున్నాడు. అయితే, మిచెల్ స్టార్క్, మిచెల్ జాన్సన్ వంటి అసాధారణ ప్రతిభావంతుల స్థానంలో వచ్చిన బోలాండ్, పారిస్ తమ తొలి వనే్డలో ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయారు. పారిస్ 8 ఓవర్లలో 53 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అందరి కంటే ఎక్కువ పరుగులిచ్చిన బౌలర్ల జాబితాలో బోలాండ్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 10 ఓవర్లలో 74 పరుగులు ఇవ్వగా, రెండో స్థానంలో అశ్విన్ ఉన్నాడు. అతను 9 ఓవర్లలో 68 ధారాదత్తం చేశాడు. మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా 9 ఓవర్లలో 61 పరుగులిచ్చాడు. మొత్తం మీద ముగ్గురు ఆటగాళ్లు అరంగేట్రం చేస్తే ఇద్దరు విఫలమయ్యారు. శరణ్ ఒక్కడే తొలి పరీక్షలో పాసయ్యాడు.