క్రీడాభూమి

సేఫ్ జోన్‌లో నలుగురే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోబర్ట్: దక్షిణాఫ్రికా చేతిలో వరుసగా రెండో టెస్టును కూడా కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టుపై కోచ్ డారెన్ లీమన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రస్తుత జట్టులోని కేవలం నలుగురి స్థానం మాత్రమే పదిలంగా ఉంటుందని, మిగతా వారి గురించి తాను ఏమీ చెప్పలేనని అతను ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియా కేవలం 20 ఓవర్ల వ్యవధిలో, 32 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోవడం లీమన్‌ను ఆందోళనకు గురి చేస్తున్నది. ఈ ఏడాది ఆగస్టులో అతని కాంట్రాక్టును క్రికెట్ ఆస్ట్రేలియా 2019 వరకూ పొడిగించింది. అయితే, ఆసీస్ వరుస వైఫల్యాలు లీమన్ కోచ్ స్థానానికి ఎసరుపెడుతున్నాయి. కెప్టెన్ స్టీవెన్ స్మిత్, డేవిడ్ వార్నర్, ఫాస్ట్ బౌలర్లు మిచెల్ స్టార్క్, జొష్ హాజెల్‌వుడ్ స్థానాలకు ఎలాంటి ప్రమాదం లేదని, మిగతా వారు కొనసాగుతారన్న భరోసా ఇవ్వలేనని లీమన్ అన్నాడు. పరాజయాలు సహజంగానే జట్టులోని ప్రతి ఒక్కరినీ వేధిస్తున్నాయని చెప్పాడు. అన్ని విభాగాల్లోనూ మళ్లీ బలోపేతం కావడంపై దృష్టి సారిస్తామని తెలిపాడు.

చిత్రం.. డారెన్ లీమన్