క్రీడాభూమి

స్పిన్నర్లే కీలకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), నవంబర్ 16: విశాఖలోని విసిఎ-విసిడిఎ పిచ్ ఆట రెండో రోజు తర్వాత స్పిన్నర్లకు అనుకూలిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఇంగ్లాండ్‌తో గురువారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో స్పిన్ త్రయం రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అమిత్ మిశ్రా భూమిక కీలకంగా మారింది. అభిమానులు కూడా వారి సామర్థ్యంపైనే నమ్మకం ఉంచి, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌కు మొదటి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజ్‌కోట్‌లో జరిగిన మొదటి టెస్టులో ఇంగ్లాండ్ అన్ని విభాగాల్లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు టీమిండియా ఒకానొక దశలో ఆలౌట్ అవుతుందేమోనన్న అనుమానం తలెత్తడం, కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజ్‌లో పాతుకుపోయి భారత్‌ను ఆదుకోవడం అభిమానులను చివరి వరకూ ఆందోళనకు గురి చేసింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ రాణించడం, భారత బౌలింగ్ విభాగం విఫలం కావడం మొదటి టెస్టులో కనిపించిన ప్రధానాంశాలు. బౌలింగ్ లోపాలను సవరించుకొని, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయాల్సిన బాధ్యత భారత స్పిన్నర్లపైనే ఉంది. జట్టు మేనేజ్‌మెంట్ అభిప్రాయం కూడా దాదాపుగా ఇదే. మొదటి టెస్టు జరిగిన రాజ్‌కోట్ పిచ్ ఆటకు ఏమాత్రం అనువుగా లేదని, అక్కడ బంతి దిశను మార్చుకోకపోవడంతో, ఫ్లాట్ వికెట్‌పై బౌలర్లు రాణించలేకపోయారని కోహ్లీ ధ్వజమెత్తిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అందుకే, రెండో టెస్టులో బ్యాటింగ్ బలాన్ని పెంచాలని అతను ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న గౌతం గంభీర్ స్థానంలో లోకేష్ రాహుల్‌ను ఓపెనర్‌గా తుది జట్టులోకి తీసుకోవడం ఖాయమైంది. ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఒక ఎక్‌స్ట్రా బ్యాట్స్‌మన్ లేదా ఆల్‌రౌండర్ ఉండాలన్నది కోహ్లీ అభిప్రాయంగా కనిపిస్తున్నది. నాలుగేళ్ల క్రితం ధోనీ నాయకత్వం వహించిన టీమిండియాపై ఇంగ్లాండ్ 2-1 తేడాతో సిరీస్‌ను గెల్చుకుంది. అప్పుడు ఐదుగురు బౌలర్ల వ్యూహాన్ని ధోనీ అనుసరించాడు. కోహ్లీ ఐదో బౌలర్ స్థానంలో ఆల్‌రౌండర్‌ను బరిలోకి దించే అవకాశాలు లేకపోలేదు. మ్యాచ్‌కి ముందు పిచ్‌ను పరిశీలించిన తర్వాతే తుది ఆటగాళ్ల జాబితాను టీమిండియా మేనేజ్‌మెంట్ ప్రకటిస్తుంది.
అశ్విన్‌పై ఒత్తిడి?
ఇలావుంటే, అశ్విన్ మొదటి టెస్టులో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌పై పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. దీనితో అతనిపై ఒత్తిడి పెరిగుతుందని విశే్లషకుల అభిప్రాయం. జడేజాను స్పెషలిస్టు స్పిన్నర్‌గానేగాక, ఆల్‌రౌండర్‌గానూ చూడాల్సి ఉంటుంది కాబట్టి, అతనితో పోలిస్తే అశ్విన్‌కు తన సత్తా నిరూపించుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. సుమారు రెండు వారాల క్రితం, న్యూజిలాండ్‌తో జరిగిన వనే్డ ఇంటర్నేషనల్‌లో అమిత్ మిశ్రా రెచ్చిపోయాడు. 18 పరుగులకే ఐదు వికెట్లు కూల్చడంతో కిస్ 23.1 ఓవర్లలో 79 పరుగులకు ఆలౌటైంది. మిశ్రా మరోసారి ఇదే స్థాయిలో రాణిస్తాడో లేదో చూడాలి. అదే పిచ్‌పై గొప్పగా ఆడతానన్న ధీమా మిశ్రాకు ఉంటుంది. ఈ కోణంలో చూసినా మిశ్రా కంటే అశ్విన్‌పైనే ఒత్తిడి పెరుగుతుందనడం వాస్తవం. కాగితంపై చూస్తే ఇంగ్లాండ్, భారత్ జట్లు సమవుజ్జీగా ఉన్నాయి. కానీ, మైదానంలో భారత క్రికెటర్లు నిలకడతో ఆడలేక, సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. ఇంగ్లాండ్‌కు ఈ సమస్య లేకపోలేదు. కానీ, సందర్భానికి తగినట్టు ఆడడం, ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకొని ముందుకు వెళ్లడం ఆ జట్టు బలం. టీమిండియా కూడా అదే తరహాలో, వ్యూహాత్మకంగా ఆడాల్సిన అవసరం ఉంది. ఇరు జట్లలోనూ పేరొందిన క్రికెటర్లు చాలా మంది ఉన్నందున, వారంతా తమ స్థాయికి తగినట్టు ఆడితే, రెండో టెస్టు ఉత్కంఠ రేపడం ఖాయం.
ఇంగ్లాండ్ కూడా..
అలిస్టర్ కుక్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ కూడా స్పిన్నర్లకు పెద్దపీట వేస్తున్నది. మొదటి టెస్టులో ఆ జట్టుకు స్పిన్నర్లే వెన్నంటి నిలిచి, విజయానికి చేరువగా తీసుకెళ్లగలిగారు. మోయిన్ అలీ, జాఫర్ అన్సారీ, అదిల్ రషీద్‌లకు విశాఖ పిచ్ ఎంత వరకూ సహకరిస్తుందో చూడాలి. భారత్ మాదిరిగానే ఇంగ్లాండ్ కూడా స్పిన్నర్లపై ఎక్కువగా ఆధారపడుతున్నది. ఉప ఖండంలో పిచ్‌లు ఫాస్ట్ బౌలింగ్ కం టే స్పిన్‌కు అనుకూలిస్తాయన్నది చాలాకాలంగా ఉన్న వాదన. పలు సిరీస్‌లు, టోర్నీల్లో ఈ విషయం స్పష్టమైంది. పిచ్‌లో ఎలాంటి మార్పు లేకపోతే, స్పిన్నర్ల హవా మరోసారి కొనసాగుతుంది.
మ్యాచ్ గురువారం ఉదయం 9.30 గంటలకు మొదలవుతుంది.