క్రీడాభూమి

ఆసీస్ తాత్కాలిక చీఫ్ సెలక్టర్‌గా హాన్స్ ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, నవంబర్ 17: ఆస్ట్రేలియా క్రికెట్ జాతీయ సెలక్షన్ కమిటీ తాత్కాలిక చీఫ్‌గా ట్రెవర్ హాన్స్ ఎంపికయ్యాడు. ఆసీస్ వరుసగా ఐదు టెస్టుల్లో ఘోర పరాజయాలను ఎదుర్కోవడంతో, చీఫ్ సెలక్టర్, మాజీ వికెట్‌కీపర్ రాడ్నీ మార్ష్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జట్టు వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న మార్ష్ ఇక ముందు తాను సెలక్టర్‌గా కొనసాగలేనని ప్రకటించాడు. ఆసీస్ క్రికెట్‌కు సరికొత్త ఆలోచనా విధానం అవసరమని, అందుకే తాను వైదొలగుతున్నానని అతనను ప్రకటించాడు. ఇది తన సొంత నిర్ణయమేనని, క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) ఒత్తిడి ఏమీ లేదని 69 ఏళ్ల ఈ మాజీ క్రికెటర్ స్పష్టం చేశాడు. కొత్త ఆలోచనలు, కొత్త వ్యూహాలతో ముందుకు సాగాల్సిన తరుణంలో తాను చీఫ్ సెలక్టర్‌గా కొనసాగడం సమంజసం కాదని ఆ ప్రకటనలో పేర్కొన్నాడు. ఆసీస్ జట్టు త్వరలోనే గాడిలో పడుతుందని, మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని అతను ధీమా వ్యక్తం చేశాడు. ఇలావుంటే, మార్ష్ వైదొలగడంతో, అతని స్థానంలో చీఫ్ సెలక్టర్‌ను నియమించాల్సిన అవసరం ఏర్పడింది. గతంలో చీఫ్ సెలక్టర్‌గా సేవలు అందించిన హాన్స్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) ఎంపిక చేసింది. మార్ష్ స్థానంలో మరో రెగ్యులర్ చీఫ్ సెలక్టర్‌ను నియమించే వరకూ హాన్స్ తన సేవలను కొనసాగిస్తాడని సిఎ ఒక ప్రకటనలో పేర్కొంది. మార్క్ వా, కోచ్ డారెన్ లీమన్, గ్రెగ్ చాపెల్ కమిటీలో సభ్యులని తెలిపింది.

చిత్రం.. ఆసీస్ జట్టును చక్కదిద్దుతాడా? ట్రెవర్ హాన్స్