క్రీడాభూమి

భారత కెప్టెన్ మరో మైలురాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ మరో మైలురాయని చేరాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మొదటి రోజు ఆటలో సెంచరీ చేసిన అతను, భారత కెప్టెన్‌గా ఎక్కువ శతకాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ తెండూల్కర్ సరసన స్థానం సంపాదించాడు. టీమిండియా కెప్టెన్‌గా సునీల్ గవాస్కర్ 11, మహమ్మద్ అజరుద్దీన్ 9 సెంచరీలు చేశారు. సచిన్‌తో కలిసి కోహ్లీ ఏడు శతకాలతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. అతని ప్రస్తుత ఫామ్‌ను, వయసును దృష్టిలో ఉంచుకుంటే, అజర్, గవాస్కర్ రికార్డులను సులభంగానే అధిగమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయ.
ఈ మ్యాచ్ కంటే ముందు టెస్టుల్లో జిమీ ఆండర్సన్ బౌలింగ్‌లో కోహ్లీ ఐదుసార్లు అవుటయ్యాడు. అతను మరే ఇతర బౌలర్ చేతిలోనూ ఇన్ని పర్యాయాలు అవుట్‌కాకపోవడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో ఆండర్సన్ బౌలింగ్‌ను అతను ఏ మాత్రం లక్ష్యపెట్టకుండా ఆడాడు. టెస్టుల్లో 14వ శతకం సాధించాడు.

చిత్రం.. విరాట్ కోహ్లీ (151 నాటౌట్)