క్రీడాభూమి

దుమారం రేగినా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైస్ట్‌చర్చి: మీడియం పేసర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్‌ను 30 ఏళ్ల వయసులో జాతీయ జట్టుకు మొదటిసారి ఎంపిక చేయడంపై దుమారం చెలరేగింది. దీనిని మతితప్పిన చర్యగా కివీస్ మీడియా అభివర్ణించింది. అయితే, తన ఎంపిక తప్పుకాదని గ్రాండ్‌హోమ్ నిరూపించాడు. ఆడిన మొదటి టెస్టు, మొదటి ఇన్నింగ్స్‌లో 41 పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్ తరఫున ఒక డెబ్యుడెంట్‌కు ఇదే అత్యుత్తమ బౌలింగ్ విశే్లషణ. ఇంతకు ముందు టిమ్ సౌథీ 55 పరుగులకు ఐదు వికెట్లు సాధించాడు. ఇలావుంటే, 65 ఏళ్ల క్రితం అలెక్స్ మోయిర్ కెరీర్‌లో మొదటి టెస్టు ఇంగ్లాండ్‌పై ఆడుతూ 155 పరుగులకు ఆరు వికెట్లు కూల్చాడు. వికెట్ల పరంగా మోయిర్ సరసన స్థానం సంపాదించుకున్న గ్రాండ్‌హోమ్, ఉత్తమ విశే్లషణలో మాత్రం అతని కంటే మెరుగైన స్థానాన్ని దక్కించుకున్నాడు. మొత్తం మీద న్యూజిలాండ్ తరఫున తమతమ మొదటి టెస్టు ఇన్నింగ్స్‌లోనే ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన ఎనిమిదో బౌలర్‌గా గ్రాండ్‌హోమ్ గుర్తింపు సంపాదించాడు.

చిత్రం.. కొలిన్ డి గ్రాండ్‌హోమ్