క్రీడాభూమి

గ్రాండ్‌హోమ్ రికార్డు స్పెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైస్ట్‌చర్చి, నవంబర్ 18: న్యూజిలాండ్ డెబ్యుడెంట్ బౌలర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ రికార్డు స్పెల్‌తో కొత్త చరిత్ర సృష్టించాడు. కెరీర్‌లో ఆడుతున్న తొలి టెస్టు, మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. అతని ధాటికి విలవిల్లాడిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్ తొలి రోజు ఆట వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. కుంభ వృష్టి కురవడంతో ఫీల్డ్ అంపైర్లు టీ విరామం వరకూ వేచి చూసి, ఆ తర్వాత ఆట జరిగే అవకాశాలు లేవని స్పష్టం ప్రకటించారు. దీనితో రెండో రోజు అవుట్ ఫీల్డ్ ఏ విధంగా ఉంటుందోనన్న అనుమానం అభిమానులను వేధించింది. అయితే, వర్షం సమస్య లేకపోయినా, తడిగా ఉన్న వాతావరణం కారణంగా పాక్ బ్యాట్స్‌మెన్ నానా ఇబ్బందులు పడ్డారు. మిస్బా ఉల్ హక్ 31 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడంటే, పాక్ బ్యాటింగ్ ఏ విధంగా కుప్పకూలిందో ఊహించుకోవచ్చు. అతనితోపాటు సమీ అస్లం (19), అసద్ షఫీక్ (16), అజర్ అలీ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. గ్రాండ్‌హోమ్ 15.5 ఓవర్లు బౌల్ చేసి, 41 పరుగులకు ఆరు వికెట్లు కూల్చాడు. టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్ చెరొక వికెట్ పడగొట్టారు.
పాక్ పతనం తర్వాత తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన న్యూజిలాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లకు 104 పరుగులు చేసింది. జీట్ రావెల్ (55), హెన్రీ నికోలస్ (29) క్రీజ్‌లో ఉన్నారు.