క్రీడాభూమి

మా జట్టు ఒత్తిడిలో ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: ఇంగ్లాండ్ జట్టులో హైక్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారని ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ పాల్ ఫార్బ్రెస్ అన్నాడు. ప్రస్తుతం జట్టు ఒత్తిడిలో ఉందని, వికెట్లు త్వరగా కోల్పోవడం వంటి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంట్నుట్టు తెలిపాడు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పాజిటివ్ దృక్పథంతో మూడో రోజు ఆటను కొనసాగించి స్కోరు పెంచడానికి ప్రయత్నిస్తామని అన్నాడు. ఇక్కడి పరిస్థితులు కూడా జట్టుకు ప్రతికూలంగా ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో బాగా ఆడగలిగినప్పుడే బ్యాట్స్‌మెన్ల నైపుణ్యం బయటపడుతుందని అన్నాడు.
* గత ఏడు టెస్టు సెంచరీల్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 140 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేయడం ఇది ఆరోసారి. ఈసారి 167 పరుగులు సాధించిన అతను, అంతకు ముందు వరుసగా 141, 169, 147, 103, 200, 211 చొప్పున పరుగులు చేశాడు. అన్ని ఫార్మాట్స్‌లో కలిపి విశాఖలో ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లో అతని అత్యల్ప స్కోరు 65 పరుగులు. మిగతా నాలుగు ఇన్నింగ్స్‌లో అతను 118, 117, 99, 167 చొప్పున పరుగులు సాధించాడు.
* ఇంగ్లాండ్ మొదటి ఐదు వికెట్లు కేవలం 80 పరుగుల తేడాతో కోల్పోయింది. భారత్‌లో టీమిండియాపై ఇంగ్లాండ్ వైఫల్యాల్లో ఇది ఆరోది. ఇంతకు ముందు, 2012లో జరిగిన అహ్మదాబాద్ టెస్టులో ఆ జట్టు 69 పరుగులకే ఐదు వికెట్లు చేజార్చుకుంది.