క్రీడాభూమి

హాఫ్ సెంచరీ హీరో అశ్విన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంగ్లాండ్‌పై రవిచంద్ర అశ్విన్ బ్యాటింగ్ సగటు అద్భుతంగా ఉంది.
అతను ఇంగ్లాండ్‌తో 13 ఇన్నింగ్స్ ఆడి,
50.90 సగటుతో మొత్తం 509 పరుగులు సాధించాడు.

పిచ్ ప్రభావం కాదు.. మా ప్రతాపమే: అశ్విన్
విశాఖపట్నం(స్పోర్ట్స్), నవంబర్ 18: పిచ్ స్వభావం మారడమే రెండో రోజు వికెట్లు పడడానికి కారణమా? అని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు భారత స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ తీవ్రంగా స్పందించాడు. వికెట్లు పడగొట్టడం కేవలం తమ ప్రతాపమే తప్ప పిచ్ స్వభావం కాదని సమాధానం ఇచ్చాడు. పిచ్‌లో ఎలాంటి లోపం లేదని, వికెట్ చాలా బాగుందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. తాము బౌలింగులో రాణించినప్పుడల్లా పిచ్ ప్రసక్తి రావడం దురదృష్టకరమన్నాడు. రెండో రోజు ఆట ముగిసిన అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో అశ్విన్ మాట్లాడాడు. బ్యాటింగును తాను చాలా ఎంజాయ్ చేశానని, జట్టుకు అవసరమైన సమయంలో అర్ధసెంచరీతో పాటు జయంత్‌తో కలిసి 8వ వికెట్టుకు 64 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ఆనందంగా ఉందన్నాడు. డెబ్యూగా ఈ మ్యాచ్‌లో అడుగుపెట్టిన జయంత్ యాదవ్ మంచి టాలెంట్ ఉన్న ఆటగాడని ప్రశంసించాడు. తొలిమ్యాచ్‌లో బ్యాటింగ్ ద్వారా 35 పరుగులు, రనౌట్ చేయడం, బౌలింగ్‌లో ఒక వికెట్ సాధించడం చిన్న విషయమేమీ కాదన్నాడు. తామిద్దరి మధ్య మంచి స్నేహం, అవగాహన ఉన్నాయని చెప్పాడు. జయంత్ చెన్నై వచ్చినప్పుడు తమ ఇంట్లో వారాల పాటు ఉన్నాడని వివరించాడు.

చిత్రం.. రవిచంద్ర అశ్విన్