క్రీడాభూమి

భారత్‌లో మ్యాచ్ ఆడేందుకు పాక్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, నవంబర్ 19: భారత్‌లో జరిగే జూనియర్ హాకీ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో పాకిస్తాన్ పాల్గొనడంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. డిసెంబర్ 8 నుంచి 18వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీలో పాల్గొనేందుకు జూనియర్ హాకీ జట్టుకు పాక్ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్, పాక్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, సరిహద్దులో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో అన్ని రకాల ద్వైపాక్షిక సంబంధాలకు తెరపడింది. క్రీడల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. కనీసం అంతర్జాతీయ ఈవెంట్స్‌లోనైనా రెండు దేశాలు పోటీపడతాయా అన్నది అనుమానంగా మారింది. ఈ పరిస్థితుల్లో, భారత్‌లో జరిగే జూనియర్ ప్రపంచ కప్‌లో ఆడేందుకు హాకీ జట్టుకు పాక్ సర్కారు అంగీకరించడం విశేషం. పాకిస్తాన్ హాకీ సమాఖ్య (పిహెచ్‌ఎఫ్) అభ్యర్థనకు పాక్ సానుకూలంగా స్పందించిందని స్థానిక మీడియా ప్రకటించింది.