క్రీడాభూమి

బ్యాటింగ్‌లో కివీస్ విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైస్ట్‌చర్చి, నవంబర్ 19: డెబ్యుడెంట్ బౌలర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ రికార్డు స్పెల్‌తో ఆరు వికెట్లు పడగొట్టడంతో పాకిస్తాన్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే కట్టడి చేసిన న్యూజిలాండ్ బ్యాటింగ్‌లో రాణించలేకపోయింది. మూడు వికెట్లకు 104 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను కొనసాగించి, 200 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ జీట్ రావెల్ (55), మిడిల్ ఆర్డర్‌లో హెన్రీ నికోల్స్ (30) కొంత సేపు పాక్ బౌలింగ్‌ను ప్రతిఘటించినా ఫలితం లేకపోయింది. పాక్ బౌలర్లు రహద్ అలీ 4 వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ అమీర్, సొహైల్ ఖాన్ చెరి 3 వికెట్లు సాధించారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన పాకిస్తాన్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్లకు 129 పరుగులు చేసింది.