క్రీడాభూమి

చైనా ఓపెన్ బాడ్మింటన్ ఫైనల్‌కు సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫజూ (చైనా), నవంబర్ 19: భారత స్టార్, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పివి సింధు ఇక్కడ జరుగుతవున్న చైనా ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ సిరీస్ మహిళల సింగిల్స్‌లో ఫైనల్ చేరింది. సెమీ ఫైనల్‌లో సంగ్ జీ హ్యున్‌ను ఢీకొన్న ఆమె ఓటమి అంచు నుంచి బయటపడి, వరుసగా మూడు మ్యాచ్ పాయింట్లను నిలబెట్టుకుంది. అతి కష్టం మీద మ్యాచ్‌ని 11-21, 23-21, 21-19 తేడాతో సొంతం చేసుకుంది. ఇక ఫైనల్‌లో టైటిల్ కోసం సన్ యూను ఢీ కొంటుంది. మరో సెమీ ఫైనల్‌లో సన్ యూ 21-8, 23-21 ఆధిక్యంతో తై జూ ఇంగ్‌పై గెలుపొందింది.
కాగా, పురుషుల సింగిల్స్‌లో జాన్ ఒ జార్గెనె్సన్, చెన్ లాంగ్ ఫైనల్‌లో తలపడతారు. మొదటి సెమీ ఫైనల్‌లో జార్గెనె్సన్ 22-20, 2-22, 21-7 తేడాతో ఇస్కందర్ జుల్‌కర్మెయిన్ జైనుద్దీన్‌పై విజయం సాధించింది. మొదటి రెండు సెట్లు హోరాహోరీగా కొనసాగితే, చివరి సెట్ ఏక పక్షంగా ముగియడం విశేషం. మరో సెమీ ఫైనల్‌లో చెన్ లాంగ్ 21-18, 9-21, 21-14 తేడాతో విక్టర్ అక్సెల్సెన్‌పై గెలిచి ఫైనల్ చేరాడు.