క్రీడాభూమి

కోహ్లీ హాఫ్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్‌కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఒక పరుగు తేడాతో ఓపెనర్లు ఇద్దరూ వెనుదిరిగారు. మురళీ విజయ్ మూడు పరుగులు చేసి స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో జో రూట్ క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. లోకేష్ రాహుల్ పది పరుగులు చేసి, బ్రాడ్ బౌలింగ్‌లోనే వికెట్‌కీపర్ జానీ బెయిర్‌స్టోకు దొరికిపోయాడు. మొదటి ఇన్నింగ్స్ సెంచరీ హీరో చటేశ్వర్ పుజారా కేవలం ఒక పరుగు చేసి, జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన జట్టును ఆదుకునే బాధ్యతను కోహ్లీతన భుజాలపై వేసుకున్నాడు. రహానేతో కలిసి అతను మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడుతూ స్కోరును 98 పరుగులకు చేర్చాడు. ఆట ముగిసే సమయానికి అతను 70 బంతుల్లో, ఆరు ఫోర్ల సాయంతో 56 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు. రహానే 54 బంతుల్లో 22 పరుగుల వద్ద ఆడుతున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడ్‌కు రెండు వికెట్లు లభించాయి. ఆండర్సన్ ఒక వికెట్ కూల్చాడు.