క్రీడాభూమి

లోధా సిఫార్సుల అమలుకు హెచ్‌సిఎ గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడానికి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సిఎ) అంగీకరించింది. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలోని సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించినట్టు గౌరవ కార్యదర్శి జాన్ మనోజ్ ఒక ప్రకటనలో తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి, లోధా కమిటీ సిఫార్సుల అమలుకు అనుగుణంగా నిబంధనావళిని మార్చాలన్న ప్రతిపాదనకు కూడా ఏకగ్రీవ ఆమోద ముద్ర లభించిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. లోధా సిఫార్సుల అమలుపై తీర్మానాన్ని ఆమోదించని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అనుబంధ సంఘాలకు నిధులను విడుదల చేయరాదని సుప్రీం కోర్టు ఇది వరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే, సభ్య సంఘాలు ఏవీ లోధా కమిటీ సిఫార్సుల అమలుకు అంగీకరించడం లేదని బిసిసిఐ అంటున్నది. ఈ కారణంగానే బోవర్డు నిబంధనావళిని మార్చడానికి సాధ్యం కావడం లేదని వాదిస్తున్నది. లోదా ప్రతిపాదనలు అమలు కాకుండా అడ్డుకోవడానికి బిసిసిఐ చేస్తున్న ప్రయత్నాలకు సుప్రీం కోర్టు గండి కొట్టింది. సభ్య సంఘాలన్నీ లోధా సిఫార్సులపై స్పష్టత ఇవ్వాలని సుప్రీం కోర్టు ధర్మాసనం తేల్చిచెప్పడంతో, సభ్య సంఘాలు స్పందిస్తున్నాయి. అందులో భాగంగానే హెచ్‌సిఎ తీర్మానాన్ని ఆమోదించింది. లోదా కమిటీ సిఫార్సులకు అనుగుణంగా నిబంధనావళిని మార్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం ద్వారా సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అడుగు ముందుకేసింది.