క్రీడాభూమి

ఫామ్‌లోకి న్యూజిలాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైస్ట్‌చర్చి, నవంబర్ 20: డెబ్యుడెంట్ బౌలర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు, రెండో ఇన్నింగ్స్‌లో ఒకటి చొప్పున మొత్తం ఏడు వికెట్లు సాధించగా, బ్యాట్స్‌మన్ జీత్ రావల్ మొదటి ఇన్నింగ్స్‌లో 55, రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 36 చొప్పున పరుగులు చేసి, అద్భుత ప్రతిభ కనబరచడంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన న్యూజిలాండ్ మొదటి టెస్టులో పాకిస్తాన్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. వరుసగా నాలుగు టెస్టుల్లో పరాజయాలను ఎదుర్కొని, మానసికంగా కుంగిపోతున్న ఈ జట్టుకు అత్యవసరమైన ఊరట లభించింది. వెస్టిండీస్‌పై తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచిన పాకిస్తాన్‌ను ఓడించడం ద్వారా బలమైన ప్రత్యర్థులను ఎదుర్కొనే సత్తా తనకు ఉందని కివీస్ నిరూపించుకుంది. ఈ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్‌ను 133 పరుగులకే కట్టడి చేసిన న్యూజిలాండ్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 200 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ జీట్ రావెల్ 55 పరుగులు చేసి కివీస్‌కు కీలకమైన ఆధిక్యాన్ని సంపాదించడంలో ముఖ్యభూమిక పోషించాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన పాకిస్తాన్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్లకు 129 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను కొనసాగించి, 171 పరుగులకు ఆలౌటైంది. సొహైల్ ఖాన్ 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, అజర్ అలీ 31 పరుగులు చేశాడు. మిగతా వారంతా దారుణంగా విఫలం కావడంతో, కివీస్ ముందు పాకిస్తాన్ కేవలం 105 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్ రెండు వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. జీత్ రావల్ 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ 61 పరుగులు సాధించి, న్యూజిలాండ్ విజయానికి బాటలు వేశాడు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది.
సంక్షిప్త స్కోర్లు
పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్: 55.5 ఓవర్లలో 133 ఆలౌట్ (మిస్బా ఉల్ హక్ 31, సమీ అస్లమ్ 19, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 6/41, ట్రెంట్ బౌల్ట్ 2/29, టిమ్ సౌథీ 2/20).
న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్: 59.5 ఓవర్లలో 200 ఆలౌట్ (జీత్ రావల్ 55, నికోలస్ హెన్రీ 30, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 40, రహత్ అలీ 4/62, మహమ్మద్ అమీర్ 3/43, సొహైల్ ఖాన్ 3/78).
పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్: 78.4 ఓవర్లలో 171 ఆలౌట్ (సొహైల్ ఖాన్ 40, అజర్ అలీ 31, బాబర్ ఆజమ్ 29, ట్రెంట్ బౌల్ట్ 3/37, టిమ్ సౌథీ 3/53, నీల్ వాగ్నర్ 3/34).
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 31.3 ఓవర్లలో రెండు వికెట్లకు 108 (జీత్ రావల్ 36 నాటౌట్, కేన్ విలియమ్‌సన్ 61).