క్రీడాభూమి

రెండో టెస్టుపై టీమిండియా పట్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), నవంబర్ 20: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టుపై టీమిండియా పట్టు బిగించింది. ప్రత్యర్థి ముందు 405 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచిన విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత్ ఆతర్వాత నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 87 పరుగులకే రెండు వికెట్లు పడగొట్టింది. మ్యాచ్ చివరి రోజైన సోమవారం ఆటలో ఇంగ్లాండ్ ఇంకా 318 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. ఇంకా ఎనిమిది వికెట్లు చేతిలో ఉన్నాయి. ఒక రోజు ఆటలో ఇంగ్లాండ్ ఈ స్కోరును అందుకోవడం అసాధ్యంగా కనిపిస్తున్నది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప అలస్టర్ కుక్ నేతృత్వంలోని ఆ జట్టు గెలిచే అవకాశాల్లేవు. సాధ్యమైనంత వరకూ డ్రాకు ప్రయత్నించడం మినహా ఇంగ్లాండ్‌కు మరో గత్యంతరం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించడం ఖాయంగా కనిపిస్తున్నది.
విరాట్ కోహ్లీ మొదటి ఇన్నింగ్స్‌లో 167, రెండో ఇన్నింగ్స్‌లో 81 చొప్పున మొత్తం 248 పరుగులు చేశాడు. భారత కెప్టెన్ ఒక టెస్టులో చేసిన అత్యధిక స్కోర్లలో ఇది మూడోది. మొదటి రెండు పర్యాయాలు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ వెస్టిండీస్‌పై ఇంతకంటే ఎక్కువ పరుగులు చేశాడు. కాగా, కోహ్లీ రెండేళ్ల క్రితం అడెలైడ్ టెస్టులో ఆస్ట్రేలియాపై 256 పరుగులు చేశాడు.
భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడుతూ నాలుగో రోజు ఆటను మూడు వికెట్లకు 98 పరుగుల స్కోరుతో కొనసాగించింది. అయితే, ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ ఆజింక్య రహానే భారీ స్కోరు చేయలేక, 26 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో అలస్టర్ కుక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో భారత్ మొత్తం మీద నాలుగవ, నాలుగో రోజు ఆటలో మొదటి వికెట్‌ను కోల్పోయింది. తర్వాత కొద్ది సేపటికే రవిచంద్రన్ అశ్విన్ పెవిలియన్ చేరాడు. 12 బంతులు ఎదుర్కొని, ఏడు పరుగులు చేసిన అతనిని వికెట్‌కీపర్ జానీ బెయిర్‌స్టో క్యాచ్ అందుకోగా స్టువర్ట్ బ్రాడ్ వెనక్కు పంపాడు. వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా కేవలం రెండు పరుగులకే అదిల్ రషీద్ బౌలింగ్‌లో ఎల్‌బిగా అవుటయ్యాడు. క్రీజ్‌లో నిలదొక్కుకొని, మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ 109 బంతుల్లో, ఎనిమిది ఫోర్ల సాయంతో 81 పరుగులు సాధించి అదిల్ రషీద్ బౌలింగ్‌లోనే బెన్ స్టోక్స్‌కు చిక్కాడు. కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న జయంత్ యాదవ్ 27 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, రవీంద్ర జడేజా (14), ఉమేష్ యాదవ్ (0), మహమ్మద్ షమీ (19) తక్కువ స్కోర్లకే అవుట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్‌కు 63.1 ఓవర్లలో 204 పరుగుల వద్ద తెరపడింది. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్, అదిల్ రషీద్ చెరి నాలుగు వికెట్లు పడగొట్టారు. జేమ్స్ ఆండర్సన్, మోయిన్ అలీ చెరొక వికెట్ సంపాదించారు.
కుక్ 53వ అర్ధ శతకం
ఇంగ్లాండ్ కెప్టెన్ అలస్టర్ కుక్ తన కెరీర్‌లో 53వ టెస్టు అర్ధ శతకాన్ని సాధించాడు. అయితే, ఆ వెంటనే అవుట్ కావడంతో ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. 405 పరుగుల భారీ లక్ష్యం కళ్ల ముందు కనిపిస్తుండగా, రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లాండ్ తొలి వికెట్‌ను హసీబ్ హమీద్ (25) రూపంలో కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో అతను ఎల్‌బి అయ్యాడు. కుక్ 188 బంతులు ఎదుర్కొని, నాలుగు వికెట్లకు 54 పరుగులు చేసి, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్‌బిగా అవుటయ్యాడు. 59.2 ఓవర్లలో 87 పరుగుల వద్ద ఇంగ్లాండ్ రెండో వికెట్ కూలింది. ఆ వెంటనే నాలుగో రోజు ఆట ముగిసినట్టు అంపైర్లు ప్రకటించారు. అప్పటికి జో రూట్ ఐదు పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు.

స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 129.4 ఓవర్లలో 455 ఆలౌట్ (చటేశ్వర్ పుజారా 119, విరాట్ కోహ్లీ 167, రవిచంద్రన్ అశ్విన్ 58, జయంత్ యాదవ్ 35, జేమ్స్ ఆండర్సన్ 3/62, అదిల్ రషీద్ 2/110, మోయిన్ అలీ 3/98).
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 102.5 ఓవర్లలో 255 ఆలౌట్ (జో రూట్ 53, బెన్ స్టోక్స్ 70, జానీ బెయిర్‌స్టో 53, అదిల్ రషీద్ 32 నాటౌట్, అశ్విన్ 5/67).
భారత్ రెండో ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 3 వికెట్లకు 98): మురళీ విజయ్ సి జో రూట్ బి స్టువర్ట్ బ్రాడ్ 3, లోకేష్ రాహుల్ సి జానీ బెయిర్‌స్టో బి స్టువర్ట్ బ్రాడ్ 10, చటేశ్వర్ పుజారా బి జేమ్స్ ఆండర్సన్ 1, విరాట్ కోహ్లీ సి బెన్ స్టోక్స్ బి అదిల్ రషీద్ 81, ఆజింక్య రహానే సి అలస్టర్ కుక్ బి స్టువర్ట్ బ్రాడ్ 26, రవిచంద్రన్ అశ్విన్ సి జానీ బెయిర్‌స్టో బి స్టువర్ట్ బ్రాడ్ 7, వృద్ధిమాన్ సాహా ఎల్‌బి అదిల్ రషీద్ 2, రవీంద్ర జడేజా సి మోయిన్ అలీ బి అదిల్ రషీద్ 14, జయంత్ యాదవ్ 27 నాటౌట్, ఉమేష్ యాదవ్ సి జానీ బెయిర్‌స్టో బి అదిల్ రషీద్ 0, మహమ్మద్ షమీ స్టెంప్డ్ జానీ బెయిర్‌స్టో బి మోయిన్ అలీ 19, ఎక్‌స్ట్రాలు 14, మొత్తం (63.1 ఓవర్లలో ఆలౌట్) 204.
వికెట్ల పతనం: 1-16, 2-17, 3-40, 4-117, 5-127, 6-130, 7-151, 8-162, 9-162, 10-204.
బౌలింగ్: జేమ్స్ ఆండర్సన్ 15-3-33-1, స్టువర్ట్ బ్రాడ్ 14-5-33-4, అదిల్ రషీద్ 24-5-82-4, బెన్ స్టోక్స్ 7-0-34-0, మోయిన్ అలీ 3.1-1-9-1.
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ (లక్ష్యం 405): అలస్టర్ కుక్ ఎల్‌బి రవీంద్ర జడేజా 54, హసీబ్ హమీద్ ఎల్‌బి అశ్విన్ 25, జో రూట్ 5 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 3, మొత్తం (59.2 ఓవర్లలో 2 వికెట్లకు) 87.
వికెట్ల పతనం: 1-75, 2-87.
బౌలింగ్: మహమ్మద్ షమీ 9-2-16-0, ఉమేష్ యాదవ్ 8-3-8-0, అశ్విన్ 16-5-28-1, రవీంద్ర జడేజా 22.2-8-25-1, జయంత్ యాదవ్ 4-1-7-0.

చిత్రం.. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ అలస్టర్ కుక్‌ను అవుట్ చేసిన రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ ఆనందం.