క్రీడాభూమి

‘సూపర్’ సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫజూ (చైనా), నవంబర్ 20: భారత బాడ్మింటన్ స్టార్ పివి సింధు ఇక్కడ జరిగిన చైనా ఓపెన్ సూపర్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆమె ఒక సూపర్ సిరీస్‌లో విజేతగా నిలవడం ఇదే మొదటిసారి. ఆదివారం జరిగిన ఫైనల్‌లో చైనా క్రీడాకారిణి సన్ యూను 21-11, 17-21, 21-11 తేడాతో ఓడించింది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన తర్వాత ఈ హైదరాబాదీ ఒక టైటిల్‌ను అందుకోవడం ఇదే ప్రథమం. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 11వ స్థానంలో ఉన్న ఆమె ఈ టైటిల్ పోరుకు ముందు సన్ యూతో ఐదు పర్యాయాలు ఢీ కొంది. రెండు విజయాలు సాధించి, మూడు పరాజయాలను ఎదుర్కొంది. తాజా మ్యాచ్‌ని తన ఖాతాలో చేర్చుకోవడం ద్వారా హెడ్ టు హెడ్ స్కోరును సమం చేసింది. ఈ ఏడాది ఆమెకు ఇది ఐదో టైటిల్. గౌహతిలో జరిగిన దక్షిణాసియా గేమ్స్ మహిళల సింగిల్స్‌లో రజతం, టీం ఈవెంట్‌లో స్వర్ణ పతకాలను సాధించిన ఆమె, కున్షాన్‌లో జరిగిన ఉబర్ కప్ టీం చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని అందుకుంది. రియో ఒలింపిక్స్ మహిళల సింగిల్స్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. తాజాగా చైనా సూపర్ సిరీస్‌ను మొట్టమొదటిసారి సాధించింది. భారత్ తరఫున ఈ టైటిల్‌ను సాధించిన రెండో క్రీడాకారిణిగా గుర్తింపు సంపాదించింది. ఇంతకు ముందు 2014లో సైనా నెహ్వాల్ ఈ టైటిల్ గెల్చుకుంది. అదే ఏడాది పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్ విజేతగా నిలిచాడు.
ఇలావుంటే, చైనా ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను జాన్ ఒ జొర్గెనె్సన్ సొంతం చేసుకున్నాడు. ఫైనల్‌లో అతను హాట్ ఫేవరిట్ చెన్ లాంగ్‌ను 22-21, 20-13 తేడాతో ఓడించాడు. పురుషుల డబుల్స్ ఈవెంట్‌లో మార్గస్ ఫెర్నాల్డీ గిడియాస్, కెవిన్ సంజయా సుకముల్జో జోడీ 21-18, 22-20 స్కోరుతో మథియాస్ బొయే, కార్‌స్టెన్ మొగెనె్సన్ జోడీని ఓడించి టైటిల్‌ను అందుకుంది. మహిళల డబుల్స్ విభాగంలో చాంగ్ యెనో, లీ సో హీ ట్రోఫీని అందుకుంది. వీరు ఫైనల్‌లో హుయాంగ్ డాంగ్‌పింగ్, లి ఇన్ హుయట్‌ను 13-21, 21-14, 21-17 తేడాతో ఓడించారు.