క్రీడాభూమి

బిసిసిఐ ఆఫీస్ బేరర్లపై వేటు వేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 21: భారత క్రికెట్ బోర్డును సంస్కరించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బిసిసిఐ పెద్దలపై జస్టిస్ ఆర్‌ఎం.లోధా కమిటీ మరోసారి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. బిసిసిఐ ఆఫీసు బేరర్లందరినీ పదవుల నుంచి తొలగించి బోర్డు పాలనా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి జికె.పిళ్లైని పరిశీలకునిగా నియమించాలని జస్టిస్ లోధా కమిటీ తమ తాజా నివేదికలో సుప్రీం కోర్టుకు విన్నవించింది. భవిష్యత్తులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) క్రికెట్ టోర్నమెంట్ల నిర్వహణకు సంబంధించిన మీడియా హక్కులను, ఇతర బిసిసిఐ కాంట్రాక్టులను అప్పగించేందుకు వీలుగా ఆడిటర్లను నియమించే కీలక బాధ్యతలను పిళ్లైకి అప్పగించాలని లోధా కమిటీ సిఫారసు చేసింది. ఈ అంశంపై సుప్రీం కోర్టు డిసెంబర్ 5వ తేదీన తదుపరి విచారణ జరుపనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీలో బెట్టింగ్ కుంభకోణం, స్పాట్-్ఫక్సింగ్ తదితర అవకతవకలు జరిగాయని వెలుగులోకి రావడంతో బిసిసిఐని సంస్కరించేందుకు తగిన సిఫారసులు చేయాలని కోరుతూ మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎం.లోధా నేతృత్వంలో సుప్రీం కోర్టు ముగ్గురు సభ్యుల కమిటీని నియమించిన విషయం తెలిసిందే. దీంతో బిసిసిఐ కార్యవర్గ ఎన్నికల్లో ఒక రాష్ట్ర క్రికెట్ సంఘానికి ఒకే ఓటు ఉండేలా చూడాలని, బోర్డులో ఆఫీస్ బేరర్లుగా పదవులు చేపట్టే వారికి వయో పరిమితి విధించడంతో పాటు ఒకసారి పదవి చేపట్టిన వ్యక్తులు మరోసారి పదవి చేపట్టేందుకు మధ్యలో కొంత విరామం ఉండేలా చూడాలని పేర్కొంటూ జస్టిస్ లోధా కమిటీ సుప్రీం కోర్టుకు పలు కీలక సిఫారసులు చేసింది. ఈ ఏడాది ఆరంభంలో సుప్రీం కోర్టు ఈ సిఫారసులను ఆమోదిస్తూ, వీటన్నింటినీ అమలు చేయాల్సిందేనని బిసిసిఐకి స్పష్టం చేసింది. అయితే వీటిలో కొన్ని సిఫారసులను మాత్రమే అమలు చేయగలమని, అంతేతప్ప అన్నింటినీ అమలు చేయడం సాధ్యం కాదని బిసిసిఐ పెద్దలు మొండికేయడంతో బోర్డుకు, జస్టిస్ లోధా కమిటీకి మధ్య వివాదం రోజు రోజుకూ ముదురుతోంది.

చిత్రం.. కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి జికె.పిళ్లై