క్రీడాభూమి

‘టాస్ గెలవడమే భారత్‌కు కలిసొచ్చింది’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), నవంబర్ 21: విశాఖ టెస్టులో తాము చివరి వరకు కష్టపడినా మ్యాచ్‌ను నిలుపుకోలేకపోవడం ఎంతో నిరాశకు గురి చేసిందని ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ అన్నాడు. టాస్ గెలవడం భారత్‌కు కలిసొచ్చిందని, తొలిరోజు సునాయాసంగా భారత్ జట్టు పరుగులు సాధించిందని అన్నాడు. రెండవ రోజు నుండి ఈ పిచ్‌పై బ్యాట్స్‌మెన్ పరుగుల కోసం కష్టపడాల్సి వచ్చిందని అన్నాడు. రెండవ రోజు అయిదు వికెట్లు కోల్పోవడం జట్టును దెబ్బతీసిందని, అక్కడి నుండి జట్టు తేరుకోలేకపోయిందని అన్నాడు. ఇలాంటి ప్రతికూల పరిస్థితిలో కూడా భారత్ గెలుపు కోసం చివరి వరకు కష్టపడేలా చేయగలిగామని అన్నాడు. రెండు టెస్టుల్లోను తాము మంచి ఆటను ప్రదర్శించామని, సిరీస్ నిలుపుకోవాలంటే రానున్న టెస్టుల్లో బాగా రాణించాల్సి ఉంటుందని చెప్పాడు. తర్వాతి మ్యాచుల్లో బ్యాటింగ్‌లో విఫలమవుతున్న డకెట్ స్థానంలో బట్లర్‌ను తీసుకుంటామని చెప్పాడు.
రివ్యూల్లో ఇంగ్లండే టాప్
ఈ మ్యాచ్‌లో రెండు జట్లు మొత్తం 20 రివ్యూలను వాడుకున్నాయి. అయితే ఇంగ్లండ్ జట్టు రివ్యూలు వాడుకోవడంలో ఒక అడుగు ముందుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 11 రివ్యూలను ఉపయోగించుకుంది. ఇందులో 3 రివ్యూలు సక్సెస్ కాగా, 8 రివ్యూలు బెడిసికొట్టాయి. అలాగే భారత్ జట్టు మొత్తం 9 రివ్యూలు వాడుకోగా, 3 రివ్యూలు మాత్రమే అనుకూలంగా, 6 ప్రతికూలంగా ఫలితాలు వచ్చాయి. ముఖ్యంగా ఇంగ్లండ్ జట్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్లు విజయ్, రాహుల్‌లను ఔటైనట్లుగా చేసిన అపీల్ రివ్యూలో పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. భారత జట్టు కెప్టెన్ కోహ్లీ కూడా ఇంగ్లండ్ జట్టు ఓపెనర్లు కుక్, హమీద్‌లు ఎల్‌బిగా ఔటైనట్లు రివ్యూ కోరాడు. అయితే రివ్యూలో ఇద్దరినీ నాటౌట్‌గా థర్డ్ అంపైర్ ప్రకటించాడు.

చిత్రం.. ఇంగ్లండ్ కెప్టెన్ ఆలిస్టర్ కుక్