క్రీడాభూమి

‘ఆ భారంపై మూడేళ్ల తర్వాతే ఆలోచిస్తా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 21: కెప్టెన్‌గా ఒత్తిడిని తాను ఇప్పుడు బాగానే ఎంజాయ్ చేస్తున్నానని, అయితే మరోమూడేళ్ల తర్వాత మాత్రమే కెప్టెన్సీ నరం ఎంత తనపై ఉందో అంనా వేయగలుగుతానని టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. ‘బహుశా మూడు నాలుగేళ్ల తర్వాత మాత్రమే కెప్టెన్సీ భారం ఎంతగా నాపై ఉందో అంచనా వేయగలుగుతాను. ప్రస్తుతానికయితే నేను కెప్టెన్సీని ఎంజాయ్ చేస్తున్నాను’ అని సోమవారం ఇక్కడ ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 246 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ కోహ్లీ చెప్పాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఈ క్యాలెండర్ ఇయర్‌లో అన్ని అంతర్జాతీయ ఫార్మెట్‌లలో కలిపి 2277 పరుగులు సాధించి రెండో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జో రూట్ 2285 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ‘బ్యాటింగ్ చేయడానికి వెళ్లినప్పుడు అదీ ముఖ్యంగా అయిదు రోజుల పాటు ఆడేటప్పుడు కెప్టెన్‌గా ఉన్న విషయంనుంచి దూరంగా ఉండడం చాలా ష్టం. బహుశా బాధ్యత మరింత పెరగవచ్చు. అయితే అదే నన్ను గాలిలోకి బంతిని ఆడకుండా కూడా చేస్తోంది’ అని కోహ్లీ చెప్పాడు. సంప్రదాయానికి భిన్నంగా ఆడే స్ట్రోక్స్‌పై తనకు నమ్మకం ఉందని స్పష్టం చేసిన ఓహ్లీ అందువల్లనే టెస్టు క్రికెట్‌లో నేను తరచూ ఆడే గాలిలోకి బంతిని కొట్టే షాట్లను ఆడకుండా కూడా చేసింది’ అని అతను చెప్పాడు. టెస్టు క్రికెట్‌లోవికెట్ల వద్ద ఎంత ఎక్కువ సేపు ఉంటే అంతగా ఒత్తిడి తగ్గుతుందని, మిగతా ఫార్మాట్లలో అలా కాదని కూడా కోహ్లీ చెప్పాడు.
ఐదుగురు బౌలర్ల వ్యూహం ఫలించింది..
విదేశాల్లో అడిలైడ్, ఇక్కడి ఎసి ఎ-విడిసి ఎ స్టేడియం నాకెప్పుడూ కలిసొచ్చే పిచ్‌లని, ఇక్కడ ఆడడానికి ఇష్టపడతానని భారత జట్టు కెప్టెన్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్ కోహ్లీ అన్నాడు. విశాఖ టెస్టుకు హాజరైన ప్రేక్షకులకు ఆనందాన్ని అందించగలిగామని అన్నాడు. ఈ మ్యాచ్‌లో అయిదు సెషన్లలో బ్యాటింగ్ చేసి 450 పరుగులకు పైగా స్కోరు చేయగలిగామని, బౌలర్లు ఈ విజయంలో ప్రధాన పాత్ర పోషించారని అన్నాడు. ఈ మ్యాచ్‌లో తాను బ్యాటింగ్‌లో రాణించి 248 పరుగులు చేయడం ఆనందంగా ఉందని అన్నాడు. ఈ మ్యాచ్ ద్వారా డెబ్యూగా జట్టులోకి అడుగుపెట్టిన జయంత్ తన టాలెంట్ నిరూపించుకున్నాడని అన్నాడు. అయిదుగురు బౌలర్లను ఈ మ్యాచ్‌లో దింపడం ఫలితాన్ని ఇచ్చిందన్నాడు.

చిత్రం.. కెప్టెన్సీలో ఒత్తిడిని ఆస్వాదిస్తున్నానని స్పష్టం చేసిన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ