క్రీడాభూమి

చెన్నై ఓపెన్‌కు వచ్చేస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, నవంబర్ 22: మన దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, పురాతనమైన చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ 22వ ఎడిషన్‌లో పాల్గొంటామని స్పెయిన్‌కు చెందిన స్టార్ ఆటగాడు రాబెర్టో బటిస్టా అగట్‌తో పాటు క్రొయేషియాకు చెందిన మరో ఆటగాడు బోర్నా కోరిక్ ధ్రువీకరించారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 6వ స్థానంలో కొనసాగుతున్న క్రొయేషియా ఆటగాడు మారిన్ సిలిక్ మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ చెన్నై ఓపెన్‌లో పాల్గొనబోతున్నట్లు ప్రకటించిన కొద్ది రోజులకే అగట్, కోరిక్ కూడా ఈ టోర్నీలో పాల్గొంటామని ధ్రువీకరించారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం అగట్ 14వ స్థానంలోనూ, కోరిక్ 48వ స్థానంలోనూ కొనసాగుతున్నారు. నంగంబాకమ్‌లోని ఎస్‌డిఎటి టెన్నిస్ స్టేడియంలో జనవరి 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే చెన్నై ఓపెన్ 22వ ఎడిషన్ టోర్నీలో పాల్గొనేందుకు వీరిద్దరూ ఒప్పందాలపై సంతకాలు చేశారు. చెన్నై అభిమానులతో ప్రత్యేక అనుంబంధాన్ని కలిగివున్న అగట్ ఈ టోర్నీలో పాల్గొననుండటం వరుసగా ఇది ఐదోసారి. జనవరిలో జరిగిన ఆక్లాండ్ ఓపెన్, ఫిబ్రవరిలో జరిగిన సోఫియా ఓపెన్ టోర్నీల్లో విజయభేరి మోగించి తన టైటిళ్ల సంఖ్యను నాలుగుకు పెంచుకున్న అగట్ ఈ ఏడాది చక్కటి ప్రదర్శనతో ముందుకు సాగుతున్నాడు. చెన్నై ఓపెన్‌లో అతను మరోసారి బరిలోకి దిగనుండటంతో సిలిక్‌కు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

చిత్రం.. రాబెర్టో బటిస్టా అగట్