క్రీడాభూమి

టెస్టుల్లో కోహ్లీకి కెరీర్ బెస్టు ర్యాంకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, నవంబర్ 22: అంతర్జాతీయ ఉత్తమ టెస్టు క్రికెట్ బ్యాట్స్‌మన్ల జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా సోమవారం విశాఖపట్నంలో ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో చక్కగా రాణించి భారత జట్టు 246 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించడంలో కీలకపాత్ర పోషించడంతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును కైవసం చేసుకున్న కోహ్లీకి టెస్టుల్లో ఇదే అత్యుత్తమ ర్యాంకు. అంతర్జాతీయ ట్వంటీ-20 ర్యాంకింగ్స్‌తో పాటు వనే్డ ర్యాకింగ్స్‌లో కోహ్లీ ఇప్పటికే అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ ఉత్తమ టెస్టు బ్యాట్స్‌మన్ల జాబితాలో ఇంతకుముందు అతనికి టాప్-10లో చోటు లభించలేదు. అయితే విశాఖ టెస్టులో కోహ్లీ అద్భుత ప్రదర్శనతో సత్తా చాటుకుని తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో మరో 81 సాధించడంతో తొలిసారి 800 పాయింట్ల మార్కును అధిగమించి తాజా టెస్టు బ్యాట్స్‌మన్ల ర్యాంకింగ్స్‌లో ఏకంగా 10 స్థానాలు ఎగబాకడంతో పాటు ఈ ఘనత సాధించిన 11వ భారత బ్యాట్స్‌మన్‌గా అవతరించాడు. విశాఖ టెస్టులో చక్కటి ప్రదర్శన ద్వారా 97 పాయింట్లు కూడగట్టుకున్న కోహ్లీ ప్రస్తుతం ఐసిసి టాప్-10 టెస్టు బ్యాట్స్‌మన్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్న ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ కంటే కేవలం 22 పాయింట్లు మాత్రమే వెనుకబడి ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో శనివారం మొహాలీలో ప్రారంభమయ్యే మూడో టెస్టులో కూడా కోహ్లీ ఇదేవిధంగా రాణించి జోరు కొనసాగిస్తే ఉత్తమ టెస్టు బ్యాట్స్‌మన్ల జాబితాలో అతను అగ్రస్థానానికి చేరువయ్యే అవకాశాలు ఉంటాయి.
ఇదిలావుంటే, విశాఖ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్క పరుగుకే నిష్క్రమించినప్పటికీ తొలి ఇన్నింగ్స్‌లో 119 పరుగులు సాధించిన టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా తాజా ర్యాంకింగ్స్‌లో ఒక స్థానాన్ని మెరుగు పర్చుకుని 9వ ర్యాంకుకు చేరగా, ఇంగ్లాండ్ వికెట్‌కీపర్/బ్యాట్స్‌మన్ జానీ బెయిర్‌స్టోతో పాటు ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కూడా తాజా ర్యాంకింగ్స్‌లో చెప్పుకోదగ్గ పురోగతి సాధించారు. విశాఖ టెస్టులో మొత్తం 87 (తొలి ఇన్నింగ్స్‌లో 53, రెండో ఇన్నింగ్స్‌లో 34-నాటౌట్) పరుగులు సాధించిన బెయిర్‌స్టో తాజా ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు ఎగబాకి 12వ ర్యాంకుకు చేరుకోగా, 76 పరుగులు (తొలి ఇన్నింగ్స్‌లో 70, రెండో ఇన్నింగ్స్‌లో 6) సాధించిన బెన్‌స్టోక్స్ ఐదు స్థానాలను మెరుగు పర్చుకుని 28వ స్థానాన్ని అందుకున్నాడు.
ఉత్తమ బౌలర్ల జాబితాలో
షమీ, జడేజా పురోగమనం
ఇక ఐసిసి ఉత్తమ బౌలర్ల జాబితాలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ఐదు స్థానాలు ఎగబాకి కెరీర్‌లో అత్యుత్తమ స్థానానికి (21వ ర్యాంకుకు) చేరుకోగా, ఎడమచేతి వాటం స్పిన్నర్ రవీంద్ర జడేజా ఒక స్థానాన్ని మెరుగు పర్చుకుని 6వ స్థానానికి చేరుకున్నాడు. అలాగే ఇంగ్లాండ్ బౌలర్లలో స్టూవర్ట్ బ్రాడ్ ఒక స్థానాన్ని మెరుగు పర్చుకుని 7వ స్థానానికి, మొరుూన్ అలీ నాలుగు స్థానాలను మెరుగు పర్చుకుని 23వ స్థానానికి చేరుకున్నారు.