క్రీడాభూమి

కరీబియన్లు.. ఊడ్చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 22: భారత్, వెస్టిండీస్ మహిళల జట్ల మధ్య జరిగిన టి20 క్రికెట్ సిరీస్‌ను వెస్టిండీస్ 3-0 తేడాతోక్లీన్ స్వీప్ చేసింది. మంగళవారం నాటి చివరి, మూడో టి20లో బ్యాటింగ్‌లో హీలీమాథ్యూస్, కెప్టెన్ స్ట్ఫోనీ టేలర్ రాణించడంతో విండీస్ 15పరుగుల తేడాతో విజయం సాధించింది. నగరానికి సమీపంలోని మూలపాడులోని దేవినేని వెంకటరమణ-ప్రణీత క్రికెట్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈమ్యాచ్‌లో భారత్‌పై అన్ని విభాగాల్లో వెస్టిండీస్ మహిళలు అధిక్యం ప్రదర్శించారు. ఓపేనర్లు హీలీమాథ్యూస్, కెప్టెన్ స్ట్ఫోనీ టేలర్ విజృంభించి మొదటి వికెట్‌కు 61పరుగుల భాగస్వామ్యంతోజట్టు స్కోర్‌ను పరుగుపెట్టించారు. హీలీ మాథ్యూస్ 22బంతుల్లో 7్ఫర్లు, ఒక సిక్స్‌తో47పరుగులకు పెవిలియన్‌కు చేరినప్పటికీ స్ట్ఫోనీ టేలర్ తనదైన శైలిలో భారత బౌలర్లకు చుక్కలు చూపించి 55బంతుల్లో 3్ఫర్లతో 44పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. టి20 ఫార్మాట్‌లో తనకు ఎదురులేదని మరోసారి నిరూపించింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు మొదట బ్యాటింగ్‌లో 20ఓవర్లలో 4వికెట్లను కోల్పోయి 139 పరుగులు చేసింది. అనంతరం 140పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 124పరుగులు చేసింది. విండీస్ బ్యాటింగ్‌లో హీలీమాథ్యూస్ 47పరుగుల వద్ద పూనమ్‌యాదవ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకోగా కెప్టెన్ స్ట్ఫోనీ టేలర్ 44పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును విజయపధంలో నడిపింది. బ్రిట్ని కూపర్ 11పరుగులు, క్యాసియానైట్ 16పరుగులు, దియేంద్ర డాటిన్ 6పరుగులు చేయగా షాక్వానా క్వింటైన్ 9పరుగులతో స్టెపానీ టేలర్‌తో కలిసి నాటౌట్‌గా ఉంది. భారత బౌలర్లలో పూనమ్‌యాదవ్ 2 వికెట్లు తీసుకోగా జులాన్‌గోస్వామి, ఎక్తాబిస్త్ చేరో వికెట్ పడగొట్టారు. అనంతరం 140 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ జట్టు బ్యాటింగ్‌లో ఆశించినంతగా ఓపెనర్లతో పాటు మిడిల్ ఆర్డర్ రాణించకపోవడంతో ఓటమి తప్పలేదు. నగరానికి చెందిన ఎస్ మేఘనతో కలిపి బ్యాటింగ్ ప్రారంభించిన విఆర్ వనిత షకీరాసెల్మాన్ బౌలింగ్‌లో మొదటి బాల్‌కు సింగిల్‌కు ప్రయత్నించి రనౌట్‌గా పరుగుల ఖాతా తెరవకుండానే వెనుతిరిగింది. మేఘన రెండవ ఓవర్‌లో వరుసగా ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టి పర్వాలేదనిపించిన వెంటనే మూడవ ఓవర్‌లో మరో ఫోర్ బాది క్రీజులో నిలదొక్కుకుందనిపించిన క్రమంలో 19పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హీలీమాథ్యూస్ బౌలింగ్‌లో షకీరాసెల్మాన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యింది. ఈక్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఎస్ మందానా 6పరుగులకే దియేంద్ర డాటిన్ బౌలింగ్‌లో షాక్వానా క్వింటైన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగింది. కష్టల్లో ఉన్న జట్టును కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్, వేదాకృష్ణమూర్తిలు భుజాన వేసుకుని 92పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు అయినప్పటికీ జట్టు ఓటమిని అడ్డుకోలేకపోయారు. 60పరుగులతో హర్మన్‌ప్రీత్‌కౌర్, 31పరుగులతో వేదాకృష్ణమూర్తి నాటౌట్‌గా నిలిచారు. విండీస్ బౌలర్లలో దియేంద్రా డాటిన్, హీలీ మాథ్యూస్ చెరోవికెట్ పడగొట్టారు.
సంక్షిప్తంగా స్కోర్లు
వెస్టిండీస్ ఇన్నింగ్స్: 20ఓవర్లలో4 వికెట్లకు 139 ( హీలీమాథ్యూస్ 47, స్ట్ఫోనీ టేలర్ 44నాటౌట్, క్యాసియా నైట్ 16, బ్రిట్నీకూపర్ 11, పూనమ్‌యాదవ్ 2/25)
భారత్ ఇన్నింగ్స్: 20ఓవర్లలో 3వికెట్లకు 124 (ఎస్ మేఘన 19, హర్మన్‌ప్రీత్‌కౌర్ 60నాటౌట్, వేదాకృష్ణమూర్తి 31నాటౌట్).

చిత్రం.. పోలీస్ కమిషనర్ సవాంగ్ చేతుల మహిళల మీదుగా ట్వంటీ-20
ఛాంపియన్స్ ట్రోఫీని అందుకుంటున్న విండీస్ కెప్టెన్ టేలర్