క్రీడాభూమి

గంభీర్ ఖేల్ ఖతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 22: ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా ఇక చివరి మూడు టెస్టుల్లో తలపడే 16 మంది భారత జట్టులో సీమర్ భువనేశ్వర్ కుమార్‌కు మళ్లీ చోటు లభించింది. వెనె్నముక గాయం నుంచి భువనేశ్వర్ పూర్తిగా కోలుకోవడంతో భారత సెలెక్టర్లు మంగళవారం అతనికి ఈ జట్టులో చోటు కల్పించారు. అయితే కెరీర్‌లో ఇప్పటివరకూ 58 టెస్టులు ఆడిన సీనియర్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ (35)ను ఈ జట్టు నుంచి తొలగించారు. 2007లో జరిగిన ట్వంటీ-20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌తో పాటు 2011లో జరిగిన వనే్డ ప్రపంచ కప్ టోర్నమెంట్ ఫైనల్స్‌లో కీలకపాత్ర పోషించిన గంభీర్‌కు సెలెక్టర్లు ముఖం చాటేయడాన్ని చూస్తుంటే అతని అంతర్జాతీయ కెరీర్‌కు తెర పడినట్టే కనిపిస్తోంది.

2007లో జరిగిన ట్వంటీ-20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌తో పాటు 2011లో జరిగిన వనే్డ ప్రపంచ కప్ టోర్నమెంట్ ఫైనల్స్‌లో కీలకపాత్ర పోషించిన భారత సీనియర్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ (35) కెరీర్‌లో ఇప్పటివరకూ 58 టెస్టులు ఆడి మొత్తం 4,154 పరుగులు సాధించాడు. వీటిలో 9 శతకాలు, మరో 22 అర్ధ శతకాలు ఉన్నాయ. టెస్టుల్లో గంభీర్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 206 పరుగులు.

ఇదిలావుంటే, ఇటీవల కోల్‌కతాలో నూజిలాండ్‌తో జరిగిన టెస్టులో ఐదు వికెట్లు సాధించి మ్యాచ్‌ను మలుపుతిప్పిన భువనేశ్వర్ కుమార్ ఆ తర్వాత వెనె్నముక గాయం కారణంగా ఆరు వారాలకు పైగా ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత భువనేశ్వర్ జట్టు సాంప్రదాయం ప్రకారం ఒక రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆడాడు. ఆ మ్యాచ్‌లో అతను మొత్తం 36 (తొలి ఇన్నింగ్స్‌లో 13, రెండో ఇన్నింగ్స్‌లో మరో 23) ఓవర్లు బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు కూడా రాబట్టి తన ఫిట్నెస్‌ను నిరూపించుకున్నాడు. దీంతో భారత జట్టులోకి నలుగురు స్పెషలిస్టు పేసర్లను ఎంచుకునేందుకు మరో అవకాశం లభించింది.
కాగా, ఇంగ్లాండ్‌తో సోమవారం విశాఖపట్నంలో ముగిసిన రెండో టెస్టులో ఆడే అవకాశం యువ ఆటగాడు లోకేష్ రాహుల్‌కు లభించకపోయినప్పటికీ చివరి మూడు టెస్టుల్లో తలపడే జట్టులో అతని స్థానం పదిలంగానే ఉంది. గాయంతో ఆటకు దూరమవడానికి ముందు అతను చక్కటి ఫామ్‌ను ప్రదర్శించడంతో సెలెక్టర్లు అతని అసాధారణ ప్రతిభపై విశ్వాసాన్ని ఉంచాల్సి వచ్చింది. అలాగే టాప్ ఆర్డర్‌లో మురళీ విజయ్ స్థానం కూడా పదిలంగానే ఉంది.
చివరి మూడు టెస్టులకు
భారత జట్టు ఇదీ
విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే (వైస్-కెప్టెన్), లోకేష్ రాహుల్, మురళీ విజయ్, చటేశ్వర్ పుజారా, కరుణ్ నాయర్, వృద్ధిమాన్ సాహా (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, అమిత్ మిశ్రా, మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, ఇశాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా.

చిత్రం.. భువనేశ్వర్ కుమార్, గౌతమ్ గంభీర్