క్రీడాభూమి

సానియా జోడీ రికార్డు విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 13: సిడ్నీ ఇంటర్నేషనల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ మహిళల డబుల్స్ విభాగంలో మార్టినా హింగిస్‌తో కలిసి ఆడుతున్న భారత స్టార్ సానియా మీర్జా సెమీ ఫైనల్స్ చేరింది. అంతేగాక, వరుసగా 28వ విజయాన్ని నమోదు చేసి, 22 సంవత్సరాల క్రితం నాటి రికార్డును సమం చేసింది. సానియా, హింగిస్ జోడీ క్వార్టర్ ఫైనల్‌లో 6-2, 6-3 తేడాతో చైనాకుచెందిన చెన్ లియాంగ్, షుయ్ పెంగ్ జోడీపై సునాయాసంగా గెలిచింది. ఈ జోడీకి వరుసగా ఇది 28వ విజయం. 1994లో గిగీ ఫెర్నాండెజ్ (పోర్టారికో), నటాషా జ్వెరెవా (బెలారస్) జోడీ ఇనే్న విజయాలతో నెలకొల్పిన రికార్డును ఈ జోడీ సమం చేసింది.