క్రీడాభూమి

హాంకాంగ్ ఓపెన్ బాడ్మింటన్ క్వార్టర్స్‌లో సింధు, సైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌలూన్, నవంబర్ 24: హాంకాంగ్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్లు పివి సింధు, సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్స్ చేరారు. రెండో రౌండ్‌లో ఈ ఇద్దరు హైదరాబాదీలు తమతమ ప్రత్యర్థుల నుంచి ఎదురైన పోటీని తట్టుకొని నిలబడ్డారు. రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించి, గత వారం చైనా ఓపెన్‌ను సొంతం చేసుకున్న సింధు రెండో రౌండ్‌లో హు యాచింగ్‌ను 21-10, 21-14 తేడాతో ఓడించింది. మొదటి సెట్‌ను సునాయాసంగా గెల్చుకున్న ఆమెకు రెండో సెట్‌లో యాచింగ్ నుంచి ప్రతిఘటన ఎదురైంది. అయితే, ఒత్తిడిని అధిగమించే సత్తా పుష్కలంగా ఉన్న సింధు సులభంగానే ఆ సెట్‌ను కూడా సొంతం చేసుకొని, క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. తదుపరి మ్యాచ్‌ని ఆమె లియాంగ్ జియాంగ్‌యూతో ఆడుతుంది. రెండో రౌండ్‌లో లియాంగ్ 21-9, 21-12 ఆధిక్యంతో ఇయూంగ్ సమేపై గెలిచింది. మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో సైనా 21-18, 9-21, 12-16 ఆధిక్యంతో సయాకా సాటోపై విజయం సాధించింది. మొదటి సెట్‌ను అతి కష్టం మీద గెల్చుకున్న సైనాకు రెండో సెట్‌లో ఎదురుదెబ్బ తగిలింది. ఆమెను పూర్తిగా డిఫెన్స్‌లోకి నెట్టిన సాటో సులభంగానే ఆ సెట్‌ను తన ఖాతాలో వేసుకుంది. దీనితో చివరిదైన మూడో సెట్‌లో ఇరువురు హోరాహోరీగా తలపడ్డారు. ఆరంభంలో గట్టిపోటీనిచ్చిన సాటో క్రమంగా పట్టు సడలించగా, ఆ అవకాశాన్ని సైనా సద్వినియోగం చేసుకుంది. కీలక సెట్‌ను సాధించి క్వార్టర్స్‌లో చెయూంగ్ ఎన్గయితో మ్యాచ్‌ని ఖాయం చేసుకుంది. ఎన్కయి రెండో రౌండ్‌లో నిచావోన్ జిందాపాల్‌పై 6-21, 21-18, 21-7 తేడాతో గెలిచింది.
అజయ్ ముందంజ
పురుషుల సింగిల్స్‌లో అజయ్ జయరామ్ కూడా ముందంజ వేశాడు. అతను రెండో రౌండ్‌లో హువాంగ్ యూజింగ్‌ను 21-18, 21-19 స్కోరుతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. అతను తదుపరి మ్యాచ్‌ని ఆన్గస్ ఇంగ్‌తో ఆడతాడు. ఆన్గస్ రెండో రౌండ్‌లో లీ చక్ యూను 21-12, 21-16 తేడాతో ఓడించాడు. కాగా, మరో భారత ఆటగాడు సమీర్ వర్మ కూడా చివరి ఎనిమిది మందిలో చోటు దక్కించుకున్నాడు. కజుమసా సకాయ్‌ని అతను 19-22, 21-15, 21-11 తేడాతో ఓడించి, క్వార్టర్సలో వెయ్ ఫెంగ్ చాంగ్‌తో పోరాటాన్ని ఖాయం చేసుకున్నాడు. చాంగ్ 15-21, 21-11, 21-15 తేడాతో భారత ఆటగాడు హెచ్‌ఎస్ ప్రణయ్‌పై విజయం సాధించాడు.

ట్యాంపరింగ్ విమర్శలు
అర్థరహితం: కుంబ్లే
మొహాలీ, నవంబర్ 24: భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్టు బ్రిటిష్ మీడియాలో వచ్చిన వార్తలను కోచ్ అనిల్ కుంబ్లే తోసిపుచ్చాడు. విశాఖపట్నం టెస్టులో ఇంగ్లాండ్ ఓటమికి కోహ్లీ బాల్ ట్యాంపరింగ్‌కు ఒడిగట్టడమే కారణమని బ్రిటిష్ మీడియా ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలు అర్థరహితమని కుంబ్లే తేల్చిచెప్పాడు. ఐసిసి నిబంధనలను అనుసరించి ఒక మ్యాచ్‌లో ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే, దానిపై మ్యాచ్ పూర్తయ్యేలోగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్ క్రికెటర్లుగానీ, ఫీల్డ్ అంపైర్లుగానీ అలాంటి ఫిర్యాదు ఏదీ చేయలేదు. థర్డ్ అంపైర్ కూడా కోహ్లీని తప్పుపట్టలేదు. అతను ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడని ఫిర్యాదు రాలేదని, కాబట్టి ఈ విషయంపై విచారణ జరిపించాల్సిన అవసరం లేదని ఐసిసి ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కుంబ్లే ప్రస్తావిస్తూ, బ్రిటిష్ మీడియాలో వచ్చిన వార్తలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించాడు. ఈ సంఘటనను ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫఫ్ డు ప్లెసిస్‌పై వచ్చిన ఆరోపణతో పోల్చడం తప్పని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. నిజానికి దక్షిణాఫ్రికా అద్భుతంగా ఆడిందని అన్నాడు. డుప్లెసిస్‌పై ఆరోపణలు చేయడంలో అర్థం లేదన్నాడు.