క్రీడాభూమి

ప్రత్యేక వ్యూహంతో కోహ్లీకి కళ్లెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, నవంబర్ 24: భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడుకు కళ్లెం వేయడానికి ఇంగ్లాండ్ జట్టు సిద్ధమవుతున్నది. ప్రత్యేక వ్యూహంతో అతనిని నియంత్రిస్తామని, సాధ్యమైనంత త్వరగా అవుట్ చేస్తామని ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ అన్నాడు. రాజ్‌కోట్‌లో జరిగిన మొదటి టెస్టు డ్రాకాగా, విశాఖపట్నం టెస్టులో ఇంగ్లాండ్ 246 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. కోహ్లీ రెండు టెస్టుల్లో కలిపి మొత్తం 248 పరుగులు సాధించాడు. వీటిలో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి. కాగా, శనివారం నుంచి ఇక్కడ మొదలుకానున్న మూడో టెస్టును గెల్చుకొని, భారత్‌కు సమవుజ్జీగా నిలవాలన్నది ఇంగ్లాండ్ లక్ష్యమని గురువారం విలేఖరులతో మాట్లాడుతూ వోక్స్ అన్నాడు. కోహ్లీని నిలువరించగలిగితే, తమ విజయావకాశాలు మెరుగవుతాయని చెప్పాడు. కోహ్లీ, పుజారా చక్కటి రాణిస్తున్నారని, భారీగా పరుగులు సాధిస్తున్నారని వోక్స్ ప్రశంసించాడు. మూడో టెస్టులో వీరిని కట్టడి చేయడానికి ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేసుకున్నామని, ప్రత్యేకించి కోహ్లీపై దృష్టి కేంద్రీకరిస్తామని అన్నాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, తమను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని స్పష్టం చేశాడు. ఎప్పుడైనా ఎదురుదాడికి దిగే సత్తా తమకు ఉందన్నాడు. టీమిండియాకు గటిటపోటీనిస్తే శక్తిసామర్థ్యాలుగల ఆటగాళ్లు తమ జట్టులో ఎంతో మంది ఉన్నారని తెలిపాడు. స్టువర్ట్ బ్రాడ్ మూడో టెస్టుకు అందుబాటులో ఉండకపోవడం జట్టును వేధిస్తున్న సమస్యేనని వోక్స్ అంగీకరించాడు. అయితే, ఆ సమస్యను అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. భారత్‌కు గట్టిపోటీనిస్తామని స్పష్టం చేశాడు.

డు ప్లెసిస్ శతకం
దక్షిణాఫ్రికా 9 వికెట్లకు 259 డిక్లేర్డ్
ఆస్ట్రేలియాతో చివరి, మూడో టెస్టు
అడెలైడ్, నవంబర్ 24: ఎబి డివిలియర్స్ అందుబాటులో లేని కారణంగా దక్షిణాఫ్రికాకు నాయకత్వం వహిస్తున్న ఫఫ్ డు ప్లెసిస్ గురువారం ఇక్కడ ఆరంభమైన మూడవ, చివరి టెస్టు మొదటి రోజు శతకంతో అదరగొట్టాడు. 164 బంతులు ఎదుర్కొన్న అతను 17 ఫోర్ల సాయంతో అజేయంగా 118 పరుగులు చేశాడు. ఓపెనర్ స్టీఫెన్ కుక్ 40 పరుగులు చేయగా, క్వింటన్ డికాక్, 24 పరుగులు సాధించాడు. డుప్లెసిస్ సెంచరీతో దక్షిణాఫ్రికా 76 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 259 పరుగులు చేయగలిగింది. అదే స్కోరువద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్టు డు ప్లెసిస్ ప్రకటించాడు. డు ప్లెసిస్‌తోపాటు, కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న తబ్రయిజ్ షంషి (18) అప్పటికి నాటౌట్‌గా ఉన్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టం లేకుండా 14 పరుగులు చేసింది. మాట్ రెన్‌షా 8, ఉస్మాన్ ఖాజా 3 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.
కొత్తగా నలుగురు
దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య గురువారం మొదలైన మూడో టెస్టులో ఇరు జట్లకు చెందిన మొత్తం నలుగురు ఆటగాళ్లు తమతమ టెస్టు కెరీర్‌ను మొదలుపెట్టారు. ఆస్ట్రేలియా తరఫున నిక్ మాడిసన్, మాట్ రెన్‌షా, పీటర్ హాండ్స్‌కోమ్ టెస్టుల్లో అరంగేట్రం చేయగా, దక్షిణాఫ్రికా జట్టులో తబ్రయిజ్ షంషి కొత్త ఆటగాడిగా చేరాడు.