క్రీడాభూమి

చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ మెస్సీ ‘డబుల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, నవంబర్ 24: సూపర్ స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ రెండు గోల్స్ సాధించడంతో, చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో బార్సిలోనా ప్రీ క్వార్టర్స్ చేరింది. సెల్టిక్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా హీరో మెస్సీ మ్యాచ్ 24, 55 నిమిషాల్లో గోల్స్ సాధించి బార్సిలోనాను టైటిల్ దిశగా మరో అడుగు ముందుకు వేయించాడు. గాయం కారణంగా విశ్రాంతి తీసుకొని, మళ్లీ బరిలోకి దిగిన అతను అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో అతను అర్జెంటీనా జట్టుకు వెన్నుముకగా మారాడు. కాగా, చాంపియన్స్ లీగ్ మ్యాచ్‌లో ఆరంభం నుంచి చివరి వరకూ బార్సిలోనా వ్యూహాత్మకంగా ఆడింది. మరోవైపు సెల్టిక్ ఏ దశలోనూ గట్టిపోటీని ఇవ్వలేక, పరాజయాన్ని మూటగట్టుకుంది. మరో మ్యాచ్‌లో అట్లెటికో మాడ్రిడ్ 2-0 తేడాతో పారిస్ జెయింట్స్ జర్మైయిన్‌పై గెలిచింది. కెవిన్ గామెరో 55, ఆంటోన్ గ్రీజ్మన్ 66 నిమిషాల్లో చేసిన గోల్స్ ఆ జట్టుకు విజయాన్ని అందించింది. మాంచెస్టర్ సిటీ, బొరుసియా ఎంగ్లాడ్‌బాచ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1గా డ్రా అయింది. బొరుసియా తరఫున రాఫెల్ 23వ నిమిషంలో గోల్ చేయగా, మాంచెస్టర్ సిటీ క్రీడాకారుడు డేవిడ్ సిల్వ 45వ నిమిషంలో ఈక్వెలైజర్‌ను సాధించాడు. లుడొగొరెట్స్/ బెసిస్, నపోలీ/ డైనమో కయూ జట్ల మధ్య మ్యాచ్‌లు కూడా డ్రా అయ్యారు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు.

డబ్ల్యుబిసి ర్యాంకింగ్స్‌లో
నీరజ్‌కు 35వ స్థానం
న్యూఢిల్లీ, నవంబర్ 24: భారత ప్రొఫెషనల్ బాక్సర్ నీరజ్ గోయట్‌కు ప్రపంచ బాక్సింగ్ మండలి (డబ్ల్యుబిసి) ర్యాంకింగ్స్‌లో 35వ స్థానం దక్కింది. గత నెల ఆసియా పసిఫిక్ టైటిల్‌ను దక్కించుకున్న అతను ఆస్ట్రేలియా బాక్సర్ బెన్ కైట్‌ను ఓడించిన తర్వాత విడుదలైన ర్యాంకింగ్స్‌లో స్థానాన్ని సంపాదించాడు. 12 రౌండ్ల టైటిల్ బౌట్‌లో 24 ఏళ్ల నీరజ్ 120-110, 119-109, 115-113 పాయింట్ల తేడాతో ఓడించాడు. మొత్తం మీద ప్రొఫెషనల్ బాక్సర్‌గా 12 ఫైట్స్‌లో పోరాడిన నీరజ్ ఎనిమిది విజయాలు సాధించాడు. డబ్ల్యుబిసి ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించుకున్నందుకు అతను హర్షం వ్యక్తం చేశాడు. ఫ్లోయిడ్ మేవెదర్ వంటి మేటి బాక్సర్లు కూడా ఉన్న జాబితాలో తనకు స్థానం లభించడం ఎంతో ఆనందంగా ఉందని అతను పిటిఐతో మాట్లాడుతూ అన్నాడు. డబ్ల్యుబిసి ఆసియా టైటిల్‌ను సాధించిన తాను అంతర్జాతీయ టైటిల్‌ను అందుకోవడమే లక్ష్యంగా శ్రమిస్తున్నట్టు చెప్పాడు. టాప్-15లోకి చేరితే, అతనికి ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం పోటీపడే అవకాశం కూడా దక్కుతుంది. ఇదే విషయాన్ని నీరజ్ ప్రస్తావిస్తూ, ర్యాంకింగ్‌ను మెరుగుపరచుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నాడు. ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం పోటీపడే అవకాశాన్ని దక్కించుకొని, తనను తాను నిరూపించుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు.