క్రీడాభూమి

ఎనిమిదేళ్ల తర్వాత..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ: వికెట్‌కీపర్ పార్థీవ్ పటేల్ సుమారు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఒక టెస్టు మ్యాచ్ ఆడేందుకు రంగం సిద్ధమైంది. రెగ్యులర్ కీపర్ వృద్ధిమాన్ సాహా కాలి కండరాలు బెణకడంతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతని స్థానంలో వృషభ్ పంత్ టెస్టు ఆడతాడని అంతా అనుకున్నారు. కానీ, ఎవరి అంచనాలకు అందని రీతిలో పార్థీవ్ ఈ అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం అతను చివరిసారి టెస్టు మ్యాచ్ ఆడినప్పుడు భారత జట్టుకు ప్రస్తుత కోచ్ అనిల్ కుంబ్లే కెప్టెన్‌గా వ్యవహరించాడు. సచిన్ తెండూల్కర్, వీరేందర్ సెవాగ్, వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ వంటి హేమాహేమీలు జట్టులో ఉన్నారు. ఇప్పుడు కుంబ్లే కోచ్‌గా అవతారం ఎత్తి, మరోసారి పార్థీవ్‌కు మార్గదర్శనం చేయనున్నాడు. అప్పట్లో అంపైర్ డిసిషన్ రివ్యూ సిస్టం (డిఆర్‌ఎస్) కొత్తగా తెరపైకి వచ్చింది. తర్వాతి కాలంగా దానిని భారత్ పూర్తిగా వ్యతిరేకించింది. లోపభూయిష్టంగా మారిన డిఆర్‌ఎస్‌ను అంగీకరించేది లేదని మొండిపట్టు పట్టింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)తోపాటు వివిధ దేశాల క్రికెట్ బోర్డులు, చివరికి పలువురు ప్రస్తుత ఆటగాళ్లు కూడా ఒత్తిడిని పెంచడంతో, ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో మొదటిసారి డిఆర్‌ఎస్‌ను అమలు చేసేందుకు అంగీకరించింది. పార్థీవ్ చివరి టెస్టు ఆడినప్పటి రోజుల్లోనే పరిచయమైన డిఆర్‌ఎస్‌ను ఇనే్నళ్ల తర్వాత టీమిండియా మొదటిసారి అమలు చేస్తుండగా, అతనికి మూడో టెస్టులో చోటు దక్కనుండడం విశేషం.