క్రీడాభూమి

ఉస్మాన్ ఖాజా సూపర్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడెలైడ్, నవంబర్ 25: ఓపెనర్ ఉస్మాన్ ఖాజా సూపర్ సెంచరీతో నాటౌట్‌గా నిలవడంతో, దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడవ, చివరి టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఆరు వికెట్లకు 307 పరుగులు చేయగలిగింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ను ఆరు వికెట్లకు 259 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, ఆతర్వాత మొదటి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆసీస్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టం లేకుండా 14 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం ఉదయం ఆటను కొనసాగించి మరో ఐదు పరుగులకే మాట్ రెన్‌షా (10) వికెట్‌ను కోల్పోయింది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 113 బంతుల్లో 59, పీటర్ హాండ్స్‌కోమ్ 78 బంతుల్లో 54 పరుగులు సాధించి అవుటయ్యారు. డేవిడ్ వార్నర్ (11), నిక్ మాడిసన్ (0), మాథ్యూ వేడ్ (4) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 307 పరుగుల చేయగా, ఉస్మాన్ ఖాజా (285 బంతుల్లో 138), మిచెల్ స్టార్క్ (50 బంతుల్లో 16) క్రీజ్‌లో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేల్ అబోట్ 38 పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చాడు. వెర్నన్ ఫిలాండర్, కాగిసో రబదాలకు చెరొక వికెట్ లభించింది.