క్రీడాభూమి

ఆత్మరక్షణలో ఇంగ్లాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, నవంబర్ 25: ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి టెస్టు డ్రాగా ముగియగా, రెండో టెస్టులో విజయభేరి మోగించి 1-0 ఆధిక్యానికి దూసుకెళ్లిన భారత్ ఆత్మవిశ్వాసంతో శనివారం నుంచి మొదలయ్యే మూడో టెస్టుకు సిద్ధంకాగా, ఒక మ్యాచ్‌ని కోల్పోయిన ఇంగ్లాండ్ ఆత్మరక్షణలో పడింది. ఈ మ్యాచ్‌ని చేజార్చుకుంటే, చివరి రెండు టెస్టుల్లో గెలిస్తేగానీ సిరీస్‌ను డ్రా చేసుకునే అవకాశం ఉండదు. అందుకే, సిరీస్‌పై ఆశలను సజీవంగా నిలబెట్టుకోవడంతోపాటు, భారత్‌కు సరైన ప్రత్యర్థిగా తనను తాను నిరూపించుకోవడానికి అలస్టర్ కుక్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ ప్రయత్నించనుంది. దీనితో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశకాలు కనిపిస్తున్నాయి. రెగ్యులర్ వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా గాయం కారణంగా మూడో టెస్టుకు దూరం కావడాన్ని మినహాయిస్తే, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎదుర్కొంటున్న సమస్యలు దాదాపు లేవనే చెప్పాలి. ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉండడం అతనికి కలిసొచ్చే అంశం.
కోహ్లీపై ఒత్తిడి: కోహ్లీపై ఒత్తిడి తప్పదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది. మొదటి టెస్టులో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడని బ్రిటిష్ మీడియా అతనిపై ఆరోపణలు గుప్పించింది. అయితే, నిర్ణీత ఐదు రోజుల్లో ఫీల్డ్ అంపైర్లుగానీ, ఇంగ్లాండ్ క్రికెటర్లుగానీ అతనిపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. రెండో టెస్టు పూర్తయ్యే వరకూ ఈ విషయాన్ని బ్రిటిష్ మీడియా కూడా ప్రస్తావించలేదు. అందుకే ఐసిసి ఈ ఆరోపణలను పట్టించుకోలేదు. కానీ, మూడో టెస్టు సమయంలో బ్రిటిష్ మీడియా తన ప్రతి కదలికను క్షుణ్ణంగా పరిశీలిస్తుందని, ఏమాత్రం అవకాశం దొరికినా తమ ఆరోపణలు నిజమని నిరూపించే ప్రయత్నం చేస్తుందని కోహ్లీకి తెలుసు. నిఘా నీడలో ఆడడం కోహ్లీకి ఇబ్బందికరంగా మారడం ఖాయం.
కుక్ సేన వ్యూహం ఏమిటో?
టీమిండియా బ్యాటింగ్‌లో పటిష్టంగా ఉంది. బౌలింగ్ కూడా మెరుగుపడిందని రెండో టెస్టు నిరూపించింది. ఈ నేపథ్యంలో భారత్‌ను కట్టడి చేయడానికి కుక్ సేన వ్యూహం ఏమిటన్నది ఆసక్తిని కలిగిస్తున్నది. బ్యాటింగ్‌లో కోహ్లీ, చటేశ్వర్ పుజారా వంటి స్టార్ల దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తామని ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, నిజంగానే ఇంగ్లాండ్ వద్ద పటిష్టమైన వ్యూహమేదైనా ఉందా లేక భారత శిబిరాన్ని గందరగోళంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నదా అన్నదే ప్రశ్న. ఏ రకంగా చూసినా భారత్‌తో పోలిస్తే ఇంగ్లాండ్ వెనుకంజలో ఉందన్నది వాస్తవం. కానీ, తనదైన రోజున ఇంగ్లాండ్ క్రికెటర్లు ఎలాంటి అద్భుతమైనా సృష్టించగలరని ఇంతకు ముందు పలు సందర్భాల్లో రుజువైంది. జేమ్స్ ఆండర్సన్ చేరిక ఆ జట్టు బలాన్ని పెంచుతున్నది. స్టువర్ట్ బ్రాడ్ గాయం కారణంగా మూడో టెస్టులో ఆడకపోవడం ఇంగ్లాండ్‌ను వేధిస్తున్న ప్రధాన సమస్య. ఆండర్సన్‌కు సరైన లైన్ దొరికితే, బ్రాడ్ లేని లోటును అతను సమర్థంగా భర్తీ చేస్తాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో అనుభవం ఉన్న అతను ఎంత వరకూ భారత బ్యాట్స్‌మెన్‌ను నిలువరిస్తాడనే అంశంపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.
మ్యాచ్ శనివారం ఉదయం
9.30 గంటలకు మొదలవుతుంది.