క్రీడాభూమి

కివీస్ చేతిలో భారత్ ఓటమి నాలుగు దేశాల హాకీ టోర్నీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, నవంబర్ 26: నాలుగు దేశాల హాకీ టోర్నమెంట్ టైటిల్ రేసు నుంచి భారత్ నిష్క్రమించింది. న్యూజిలాండ్‌తో శనివారం చివరి వరకూ హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 2-3 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. దీనితో టైటిల్ కోసం పోటీపడే అవకాశాన్ని చేజార్చుకొని, ఆదివారం మూడో స్థానం కోసం మలేసియాతో పోరును ఖాయం చేసుకుంది. మ్యాచ్ ఆరంభమైన మొదటి 15 నిమిషాల్లో భారత క్రీడాకారులు దూకుడును ప్రదర్శించారు. కానీ, గోల్స్ చేయడంలో విఫలమయ్యారు. మ్యాచ్ 18వ నిమిషంలో రూపీందర్ పాల్ సింగ్ ద్వారా ఈ మ్యాచ్‌లో తొలి గోల్ నమోదైంది. ఒక గోల్ సంపాదించిన తర్వాత భారత్ వ్యూహాత్మకంగా ఆడుతూ, న్యూజిలాండ్‌ను అడ్డుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. దీనితో చాలాసేపు సంకుల సమరం జరిగింది. 47వ నిమిషంలో ప్రతిష్టంభనను ఛేదించిన న్యూజిలాండ్ ఆటగాడు నిక్ రాస్ ఈక్వెలైజర్‌ను అందించాడు. మరో నిమిషంలోనే జాకబ్ స్మిత్ ద్వారా కివీస్‌కు రెండో గోల్ లభించింది. మ్యాచ్‌లో మొదటిసారి ప్రత్యర్థి కంటే వెనుకబడిన భారత్ తీవ్ర స్థాయిలో ప్రతిఘటనకు దిగింది. కానీ, న్యూజిలాండ్ రక్షణ వలయాన్ని ఛేదించలేకపోయింది. 57వ నిమిషంలో రూపీందర్ పాల్ సింగ్ తన రెండో గోల్‌ను చేయగా, అదే నిమిషంలో న్యూజిలాండ్‌కు హుగో ఇన్‌గ్లిస్ గోల్‌ను అందించాడు. అనంతరం ఒక్క గోల్ కూడా నమోదుకాకపోవడంతో, కివీస్ 3-2 తేడాతో గెలిచింది. భారత్ టైటిల్ రేసు నుంచి నిష్క్రమించింది.