క్రీడాభూమి

పెవిలియన్ అటు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ: బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్టు బ్రిటిష్ మీడియా నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇంగ్లాండ్‌తో శుక్రవారం మొదలైన మూడో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటలో బెన్ స్టోక్స్‌తో అనుచితంగా ప్రవర్తించాడని బ్రిటన్ నుంచి వచ్చిన పాత్రికేయులు ఆరోపించడంతో, కొత్త వివాదం తెరపైకి వచ్చింది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో బెన్ స్టోక్స్ క్రీజ్ నుంచి బయటకు వచ్చి భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు. అయితే, బ్యాట్‌కు కనెక్ట్ కాకుండా బంతి నేరుగా వికెట్‌కీపర్ పార్థీవ్ పటేల్ గ్లోవ్స్‌లోకి వెళ్లింది. అతను ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టంప్ చేశాడు. తీవ్ర నిరాశకు గురైన స్టోక్స్ వెనుదిరగ్గా, జడేజాతో కలిసి ఆనందం పంచుకుంటున్న కోహ్లీ పెద్దగా అరుస్తూ, అతనికి పెవిలియన్‌కు వెళ్లే దారి చూపాడు. దీనితో ఆగ్రహించిన స్టోక్స్ వెనక్కు తిరిగి కోహ్లీతో వాగ్వాదానికి దిగాడు. ఫీల్డ్ అంపైర్ మరాస్ ఎరాస్మస్ జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. అయితే, మొదటి రోజు ఆట పూర్తయిన తర్వాత బ్రిటిష్ పాత్రికేయులు ఈ సంఘటనను భూతద్దంలో పెట్టి చూపేందుకు ప్రయత్నించారు. టాప్ స్కోరర్‌గా నిలిచిన జానీ బెయిర్‌స్టోను వివరాలు తెలపాలని కోరారు. అయితే, నాన్‌స్ట్రయికిండ్ ఎండ్‌లో ఉన్నప్పటికీ తనకు వాళ్లిద్దరూ ఏమి మాట్లాడుకున్నారో వినిపించలేదని బెయిర్‌స్టో స్పష్టం చేశాడు. ప్రేక్షకులు పెద్దఎత్తున అరుస్తుండగా తాను ఏమీ వినలేదని అంటూ వివాదానికి తెరదించే ప్రయత్నం చేశాడు.